
ప్రేమలు, పెళ్లి, విడాకులు అనేవి సమాజంలో కామన్ గా మారిపోయాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్ గా ఇవి వినిపిస్తూనే ఉంటాయి. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారిపోతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా బ్రేకప్స్‌తో, రిలేషన్ షిప్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు విడాకులు అనౌన్స్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో ఆరు సినిమాలే చేసింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. నటనతోనే కాదు అందంలోనూ ఈ అమ్మడు అప్సరసే.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన నటించింది.
కానీ ఇప్పుడు ఊహించని విధంగా టాలీవుడ్ కు దూరం అయ్యింది. ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లాడింది. కానీ వీరికాపురం కొన్నాళ్లే నిలబడింది. మూడేళ్లకే మొగుడికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకొని పిల్లాడిని కూడా కనేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ అమలాపాల్. తెలుగులో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన బెజవాడ సినిమాతో అడుగుపెట్టింది.
ఆ సినిమా తర్వాత సిద్దార్థ్ తో చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్. రామ్ చరణ్ సరసన నాయక్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి ఆ తర్వాత తెలుగులో అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. నానితో చేసిన జెండాపై కపిరాజు సినిమా వచ్చివెళ్లిన విషయం కూడా చాలా మందికి తెలియదు. అలాగే పిట్ట కథలు అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాల పైనే ద్రుష్టి పెట్టింది. అయితే 2014 తమిళ్ దర్శకుడు ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత 2017లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె నటుడు జగత్ దేశాయ్‌ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది. వీరికి ఓ బిడ్డకూడా జన్మించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.