Headlines

ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!


ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ అమలు, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత తదితర అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు డీజీ చారు సిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పన నుంచి అమలు వరకు జరిగిన అన్ని ప్రక్రియలను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించనుంది.

ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా, వెండర్ ఎంపికలో ఏవైనా అక్రమాలు జరిగాయా అనే అంశాలపై లోతుగా విచారణ చేపట్టనుంది. అలాగే పోర్టల్‌లో భూముల వివరాల డేటా భద్రత, వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగాయా అనే కోణంలో కూడా ఆరా తీయనుంది. పోర్టల్ డిజైన్, సాంకేతిక లోపాలు, వాటి వల్ల ప్రజలకు లేదా ప్రభుత్వానికి ఎదురైన సమస్యలను కూడా పరిశీలించనుంది.

అనధికార లావాదేవీలు, రెవెన్యూ నష్టానికి దారితీసిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్న ఎస్‌ఈటీ, ఈ వ్యవహారంలో విదేశీ సంస్థల ప్రమేయం ఉందా అనే కోణాన్ని కూడా పరిశీలించనుంది. విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనుంది. అవసరమైతే మధ్యంతర నివేదికలను కూడా అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ధరణి పోర్టల్‌కు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక విచారణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *