Headlines

Telangana Assembly Live: మూడో రోజు పక్కా యాక్షన్ ప్లాన్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్.. | Telangana Assembly Session Day 3 Live: BRS Strategy, Congress Counter and BRS MLAs’ Meeting With Governor – Hyderabad in Telugu


మూడోరోజు కూడా తెలంగాణ అసెంబ్లీలో ముచ్చెమటలేనా. పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో వస్తున్నాయి పార్టీలు. సో.. బీఆర్ఎస్ ఏం చేయబోతోంది. కాంగ్రెస్ ఎలా నిలువరించబోతోంది. రెండు పార్టీల మధ్య బీజేపీ అజెండా ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు బుధవారం ప్రారంభయ్యాయి. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై అధికారపార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగా చర్చ జరగే అవకాశం కనిపిస్తోంది. అయితే.. సభా సమయం వృధా చేయొద్దని.. సభను సజావుగా నడిపించాలని బీజేపీ కోరుతోంది.. ఈ క్రమంలో ఇవాళ ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. మండలిలో తాతా మధు వ్యవహారంపై చర్చ జరగనుంది.. హేట్‌ స్పీచ్‌పై CM రేవంత్‌రెడ్డి చర్చలో పాల్గొననున్నారు.

గవర్నర్ ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

ఇదిలాఉంటే.. ఇవాళ గవర్నర్‌ను BRS ఎమ్మెల్యేలు కలవనున్నారు. మధ్యాహ్నం 12:45కి గవర్నర్‌తో BRS ఎమ్మెల్యేల సమావేశం ఉండనుంది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరుపై.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *