Headlines

మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం? | Why Are Heroines Taking Social Media Breaks AI Misuse and Trolls Take a Toll video – Entertainment Videos in Telugu

మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం? | Why Are Heroines Taking Social Media Breaks AI Misuse and Trolls Take a Toll video – Entertainment Videos in Telugu


సోషల్ మీడియాతో హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారా..? ట్విట్టర్, ఇన్‌స్టాతో వచ్చే లాభాల కంటే వాళ్లకు నష్టాలే ఎక్కువగా ఉన్నాయా..? ప్రశాంతంగా ఉన్న లైఫ్‌ను సోషల్ మీడియా బాగా డిస్టర్బ్ చేస్తుందా..? అందుకే సడన్ బ్రేక్స్ తీసుకుంటున్నారా..? 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియాకు రామనేంత రచ్చ ఏం జరుగుతుందక్కడ..? సోషల్ మీడియాకు రెగ్యులర్ బ్రేక్స్ ఇస్తున్నారు హీరోయిన్లు. అందులో వచ్చే లాభాల కంటే నష్టాలతోనే విసిగిపోయామంటున్నారు బ్యూటీస్. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, AI మిస్ యూజ్, ట్రోలింగ్, పర్సనల్ టార్గెటింగ్‌తో పిచ్చెక్కిపోతుందంటున్నారు వాళ్లు. ఐశ్వర్య లక్ష్మి ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియా వైపు రానని తెగేసి చెప్పారీమే. మొన్నామధ్య ప్రేమలు బ్యూటీ మమితా బైజు సైతం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చారు. సౌత్‌లో వరస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ట్విట్టర్, ఇన్‌స్టాకు దూరం కావడానికి ప్రధాన కారణం ప్రశాంతతే. అందుకే కెరీర్‌కి ముఖ్యం అని తెలిసినా కూడా వాటికి దూరమయ్యారు మమిత. తన అప్డేట్స్ అన్నీ టీమ్ కవర్ చేస్తోందని తెలిపారు మమిత. హీరోయిన్స్ ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు.. మొన్నీమధ్యే కయాదు లోహర్ సైతం ప్రైవేట్ స్పేస్ కావాలంటూ సోషల్ మీడియాకు దూరమయ్యారు. ప్యారడైజ్‌తో పాటు మరో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న కయాదు.. మనశ్శాంతి కోసం ఓ చిన్న బ్రేక్ అవసరం అన్నారు. ముఖ్యంగా నెగిటివిటీని దూరం చేసుకోడానికి.. సోషల్ మీడియాకు దూరం అవుతున్నారు ఈ బ్యూటీస్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *