Headlines

మార్కెట్‌లోకి పోకో M8x 5G స్మార్ట్‌ఫోన్‌! డిజైన్​, ఫీచర్లు, భారీ బ్యాటరీతో ఆకర్షించేస్తోంది


మార్కెట్‌లోకి పోకో M8x 5G స్మార్ట్‌ఫోన్‌! డిజైన్​, ఫీచర్లు, భారీ బ్యాటరీతో ఆకర్షించేస్తోంది

పోకో సంస్థ తన సరికొత్త ‘పోకో M8x 5G’ స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్, ఆకర్షణీయమైన గ్రీన్ కలర్ మరియు గోల్డ్ ఫ్రేమ్ డిజైన్‌తో టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. టెక్ ప్రపంచంలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఆకర్షణీయమైన లుక్స్

తాజాగా విడుదలైన అధికారిక టీజర్‌లో ఫోన్ వెనుక భాగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టెక్స్చర్డ్ ఫినిషింగ్‌తో ఉన్న గ్రీన్ కలర్, దానికి తోడు గోల్డ్ కలర్ ఫ్రేమ్ అండ్ కెమెరా మాడ్యూల్ ఈ ఫోన్‌కు అచ్చం ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన ఇతర పోకో ఫోన్లతో పోలిస్తే దీని డిజైన్ చాలా డిఫరెంట్‌గా, అత్యంత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వెనుక వైపు పైభాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు.

ఇందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అలాగే ఫోన్‌కు కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్‌ను అందించారు. అయితే కెమెరా పిక్సెల్స్, శక్తివంతమైన ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యం వంటి పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మునుపటి మోడళ్లతో పోలిక

ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే ప్రత్యేకంగా విక్రయానికి రానుంది. త్వరలోనే దీని అధికారిక లాంచ్ డేట్‌తో పాటు మిగిలిన ఫీచర్ల వివరాలను కూడా కంపెనీ ఒక్కొక్కటిగా ప్రకటించే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలే పోకో సంస్థ M8 పవర్ వేరియంట్‌ను రూ.24,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

ఆ ఫోన్ ఏకంగా 8000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఎన్నో హై-ఎండ్ ఫీచర్లతో వచ్చింది. మరి ఈ కొత్త పోకో M8x 5G దాని కంటే తక్కువ ధరకు వస్తుందా లేదా మరింత అధునాతన ఫీచర్లతో అలరించనుందా అనేది వేచి చూడాలి. పోకో నుంచి రాబోతున్న ఈ కొత్త ఫోన్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *