Headlines

Video: తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా ఎలా మార్చేశాడో చూడండి..


Video: తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా ఎలా మార్చేశాడో చూడండి..

వయసు పెరిగే కొద్దీ అనుభవం, లౌక్యం పెరుగుతాయంటారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎంతో సులువుగా ఎలా పరిష్కరించుకోవాలో పెద్దవారిని చూసి నేర్చుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే ఇది అక్షరాలా నిజమని ఒప్పుకోక తప్పదు. చేతిలోని సాధారణ ఊతకర్రను అవసరానికి తగినట్లు క్షణాల్లో కుర్చీలా మార్చేసి విశ్రాంతి తీసుకున్న ఓ వృద్ధుడి వినూత్న ఆలోచన ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇండియా ట్రెండ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో.. ఓ వృద్ధుడు చేతిలో ఉన్న ఊతకర్ర సహాయంతో రోడ్డుపై నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాడు. కాసేపటికి బాగా అలసిపోయినట్లుగా కనిపించిన ఆయన.. ఎక్కడా కూర్చోవడానికి బెంచీ లేదా అరుగు కోసం వెతకలేదు. వెంటనే చేతిలోని స్టిక్‌ను చాకచక్యంగా తెరిచి, దానిని ఒక చక్కటి సీటులా మార్చుకుని దర్జాగా కూర్చుని సేదతీరారు.

ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సమయంలోనే 30 వేలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. వృద్ధుడి సమయస్ఫూర్తి, జ్ఞానాన్ని చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కామెంట్ సెక్షన్‌లో తమదైన శైలిలో స్పందిస్తూ.. ‘‘ఏ సమస్యకైనా ముందుగానే ఇలాంటి స్మార్ట్ పరిష్కారం వెతుక్కోవడం చాలా గొప్ప విషయం’’ అని ఒకరు కామెంట్ చేశారు.
‘‘మన దగ్గర లేని వసతుల గురించి ఫిర్యాదులు చేయడం కంటే ఉన్న వనరులతోనే ఎలా సంతోషంగా, సౌకర్యవంతంగా ఉండాలో ఈ తాతగారు చేసి చూపించారు’’ అని మరొకరు రాసుకొచ్చారు. ఈ పెద్దాయన నిజంగా చాలా తెలివైనవారు.. వయసుతో పాటు వచ్చిన పరిణతి అంటే ఇదే అంటూ మరో నెటిజన్ అభినందించారు.

చిన్న ఆలోచనతో పెద్ద సమస్యను దూరం చేసుకోవచ్చని ఈ వీడియో నిరూపిస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో కాళ్ల నొప్పులు, అలసటతో ఇబ్బంది పడే వృద్ధులకు ఇలాంటి ఫోల్డబుల్ చైర్ వాకింగ్ స్టిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని వాడుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

వీడియో చూడండి..

 

View this post on Instagram

 

A post shared by India Threads (@theindiathreads)



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *