Headlines

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. 156 అడుగుల భారీ ఫ్లెక్సీ! ఎక్కడంటే..? | Chiranjeevi 71st Birthday: Mega Fans Celebrate with 156 Feet Film Titles Flex in Andhra Pradesh


అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మెగా యూత్ ఫోర్స్ కో కన్వీనర్ కందాల చంటి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు విన్నుతనంగా నిర్వహించారు. చిరంజీవి నటించిన పునాదిరాళ్లు చిత్రం నుండి ఇప్పటివరకు 156 చిత్రాల్లో నటించిన సినిమా పేర్లను 156 అడుగుల పొడవు ఫ్లెక్సీలో వేసి పి.గన్నవరం డొక్కా సీతమ్మ వారధిపై ర్యాలీ నిర్వహించారు.

పి గన్నవరం డొక్కా సీతమ్మ వారధి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద పూజలు నిర్వహించి అనంతరం అక్కడనుండి బ్రిడ్జిపై ర్యాలీగా ఫ్లెక్సీని ఊరేగిస్తూ పి.గన్నవరం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సెంటర్లో బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు మెగా అభిమానులు. ఎక్కడ లేని విధంగా 150 అడుగుల పొడవు గల ఫ్లెక్సీని దానిపై చిరంజీవి నటించిన 150 చిత్రాలు పేర్లను ముద్రించి ర్యాలీగా ఊరేగించడంతో జనం ఆసక్తిగా తిలకించారు.

వీడియో చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *