Headlines

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్‏కి ఒకప్పటి స్టార్ హీరోయిన్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. | Heroine Rekha Vedavyas Reacts On Bigg Boss 10 Telugu Entry

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్‏కి ఒకప్పటి స్టార్ హీరోయిన్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. | Heroine Rekha Vedavyas Reacts On Bigg Boss 10 Telugu Entry


హీరోయిన్ రేఖ వేదవ్యాస్ తన వ్యక్తిగత , వృత్తిపరమైన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, ఆరోగ్య సవాళ్లను ఎలా అధిగమించారో వివరించారు. ఆ సమయంలో తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారని అడిగినప్పుడు, “చాలా కష్టమైంది. చిన్న ఏజ్‌లో ఒక చోట వెళ్ళిపోతారు, ఎక్స్‌పెక్ట్ చేయకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా మళ్ళీ లైఫ్‌లో అలా వెళ్తే ఏం జరుగుతుంది అని అర్థం కాదు. అది నేర్చుకోవడానికి టైం పడుతుంది, కానీ హ్యూమన్ నేచర్ సిచువేషన్ బట్టి అలవాటు అయిపోతుంది. దేవుడు మనకి ఇచ్చిన వరం అది. స్టార్టింగ్ లో ఒక రెండు, మూడు నెలలు సమయం పట్టినా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరే వేరే సమయం పడుతుంది కానీ ఇవెంచువల్లీ అడ్జస్ట్ అయిపోతారు,” అని చెప్పారు. తన జీవితంలో మళ్ళీ అలాంటి రోజు రాకూడదు అనుకున్న సందర్భం గురించి మాట్లాడుతూ, కెరీర్‌లో పని చేయడం ఆపి, మళ్ళీ ప్రారంభించిన మధ్యలో వచ్చిన గ్యాప్ తనను చాలా ప్రభావితం చేసిందని, అలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. అందరికీ హ్యాపీ డేస్ కావాలని, మంచి రోజులు, పీస్ ఆఫ్ మైండ్, మంచి ఆరోగ్యం, మంచి ఆదాయం, వర్క్, ప్రేమ కావాలని అన్నారు.

గతంలో తనకు ఏదో ఆరోగ్య సమస్య వచ్చిందని విన్నానని అడిగినప్పుడు, “అది ఐ యామ్ స్టిల్ నాట్ రెడీ టు టాక్ అబౌట్ ఇట్. అది నా లైఫ్‌లో ఒక చాప్టర్. దేవుడి దయ వల్ల ఇప్పుడు నేను బాగున్నాను,” అని రేఖ వేదవ్యాస్ స్పష్టం చేశారు. ఆ సమయంలో తన కోసం ప్రార్థించిన, మంచి కోరుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కూడా ఇప్పటికీ అభిమానులు తన ఆరోగ్యం గురించి అడుగుతుంటారని, తాను ఇప్పుడు బాగానే ఉన్నానని వారికి తెలియజేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం తాను ముంబైలో నివసిస్తున్నానని, హైదరాబాద్‌కు ముంబైకి ఒక గంట ప్రయాణం మాత్రమేనని తెలిపారు. ఏ పని చేయాలన్నా ఎక్కడి నుంచైనా వచ్చి చేయొచ్చని, తనకు పెళ్లి కాలేదు కాబట్టి అవసరం వస్తే ఇక్కడే షిఫ్ట్ కావడానికి కూడా ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు.

బిగ్ బాస్ షోలో పాల్గొనడంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, “బిగ్ బాస్‌కి వెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. అన్ని కెమెరాల ముందు అన్ని రోజులు గొడవలు చేసుకుంటూ, అదంతా టాస్క్‌లు చేసుకుంటూ ఉండాలంటే అది ఒక వేరే రకమైన ధైర్యం ఉండాలి దానికి. సో ఎవరెవరైతే అక్కడ వెళ్ళారో వాళ్లకందరికీ హాట్స్ ఆఫ్. నాకు అది లేదు. దట్స్ నాట్ మై కప్పు టీ. గెస్ట్‌గా వెళ్లాలంటే వెళ్తాను. వేరే ఏదైనా క్రియేటివ్ ఐడియాస్ ఉంటే వెళ్తాను. ఒక కంటెస్టెంట్‌గా నా వల్ల కాదు,” అని అన్నారు. తన కోరిక గురించి అడగగా, “ఇది అని కాదు ఎనీథింగ్ నన్ను ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలి అలాంటి ప్రాజెక్ట్,” అని రేఖ వేదవ్యాస్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

రేఖ వేదవ్యాస్ ఫోటో..

Rekha Vedhavyas

Rekha Vedhavyas

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *