Headlines

వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా | Why Are Tollywood Superstars Taking Years for One Movie video tv9d – Entertainment Videos in Telugu

వాళ్లు కూడా ప్రభాస్‌, బన్నీని ఫాలో అవుతారా? లాంగ్ గ్యాప్‌కు చెక్ పడుతుందా | Why Are Tollywood Superstars Taking Years for One Movie video tv9d – Entertainment Videos in Telugu


టాలీవుడ్‌లో ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే స్టార్ హీరోలు.. ఇప్పుడు ఒక్క సినిమాకు రెండు మూడేళ్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి బడా స్టార్లు ఒక్కో సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్‌ను వెయిటింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడమే కాదు.. అభిమానులు వెయిటింగ్‌తో విసిగిపోతున్నారు. అందుకే కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి స్టార్ హీరోలు ఈ ట్రెండ్‌ను మారుస్తారా.? ఒకే సినిమా మీద ఏళ్ల తరబడి వర్క్ చేయటం ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు అలవాటుగా మారిపోయింది. ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ రెండేళ్ల టైమ్ తీసుకున్నారు. ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్, రాజమౌళి ‘వారణాసి’ కోసం మహేష్ బాబు కూడా భారీగా టైమ్ తీసుకుంటున్నారు. రెండు మూడేళ్లు ఒకే ప్రాజెక్ట్ పట్టుకుని కూర్చోవడం వల్ల మేకింగ్ కాస్ట్ పెరిగిపోయి బడ్జెట్లు తడిసి మోపెడవుతున్నాయి. అభిమానుల నిరీక్షణ కూడా ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. అయితే ఒకప్పుడు ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల టైమ్‌లో ఇలాగే ఏళ్ల తరబడి లాంగ్ గ్యాప్ తీసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు రూట్ మార్చారు. ఆ గ్యాప్‌ను కవర్ చేసేందుకు వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. ‘ది రాజా సాబ్’ రిలీజ్‌కు ముందే.. హను రాఘవపూడి ‘ఫౌజీ’ ని పట్టాలెక్కించారు. ఫౌజీ వర్క్‌ జరుగుతుండగానే సందీప్ వంగ ‘స్పిరిట్’ని స్టార్ట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప తర్వాత.. షార్ట్ గ్యాప్ తరువాత నెక్ట్స్ మూవీ రాకాను స్టార్ట్ చేశారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే లోకేష్‌ కనగరాజ్ కెప్టెన్సీలో నెక్ట్స్ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఇలా వరుస సినిమాలతో గ్యాప్‌ను కవర్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులను లైనప్ చేయడం వల్ల ఫ్యాన్స్‌ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.. ప్రభాస్, బన్నీ స్టైల్‌ను మిగతా హీరోలు కూడా ఫాలో అయితే మంచిదన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. భారీ ప్రాజెక్టులు చేస్తున్న హీరోలు ప్యారలల్‌గా మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్తే.. ప్రతీ ఏడాది ఒక రిలీజ్ ఖాయంగా ఉంటుంది. దీనివల్ల బడ్జెట్లు కంట్రోల్‌లో ఉండటమే కాకుండా టాలీవుడ్ బాక్సాఫీస్ కూడా కళకళలాడుతుంది. మరి మన హీరోలు ఇప్పటికైనా మారుతారేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *