Headlines

Varanasi: వారణాసికి ఐమ్యాక్స్ కష్టాలు.. జక్కన్న ముందు హాలీవుడ్ సినిమాల సవాల్! | Varanasi’s IMAX Release Faces a Major Challenge: Hollywood Competition Threatens Global Screens video – Entertainment Videos in Telugu

Varanasi: వారణాసికి ఐమ్యాక్స్ కష్టాలు.. జక్కన్న ముందు హాలీవుడ్ సినిమాల సవాల్! | Varanasi’s IMAX Release Faces a Major Challenge: Hollywood Competition Threatens Global Screens video – Entertainment Videos in Telugu


రామాయణకు మాత్రమే కాదు.. వారణాసికి కూడా ఈ థియేటర్ల తిప్పలు తప్పేలా లేవు. సినిమాను పూర్తి ఐమ్యాక్స్‌లోనే తీస్తున్నారు జక్కన్న.. కానీ దాన్ని వరల్డ్ వైడ్‌గా చూపించడానికి స్క్రీన్స్ కూడా కావాలి కదా.. అసలే పెద్ద స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. పైగా వరసగా వస్తున్న హాలీవుడ్ సినిమాలు వారణాసికి సవాల్ విసురుతున్నాయి. మరిప్పుడు జక్కన్న దారెటు..? ఇంటర్నేషనల్ రీచ్ కోసం సంచలన నిర్ణయం తీసుకుంటారా..? రాజమౌళి ఫస్ట్ టైమ్ వారణాసిని ఆన్ టైమ్ పూర్తి చేసేలా కనిపిస్తున్నారు.. ఈ సినిమా షూట్ 80 శాతం పూర్తైంది. జనవరి నాటికి ఫస్ట్ కాపీ కూడా రెడీ కానుంది. 2027, ఏప్రిల్ 7న చెప్పినట్లుగానే సినిమా విడుదల కానుంది. అన్నీ బాగానే ఉన్నా.. అదే టైమ్‌లో హాలీవుడ్ నుంచి మార్చి 26న ‘గాడ్జిల్లా ఎక్స్‌కాంగ్’.. ఏప్రిల్ 9న ‘పానిక్ కేర్ ఫుల్లీ’ రాబోతున్నాయి. ఈ మూడింటి మధ్య ఐమ్యాక్స్ స్క్రీన్స్ సమరం తప్పేలా లేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐమ్యాక్స్ స్క్రీన్స్ సంఖ్య పరిమితంగా ఉండటమే ఇప్పుడు వారణాసికి పెద్ద సమస్యగా మారేలా కనిపిస్తోంది. ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి టైట్ కాంపిటీషన్‌లో సినిమా వస్తుందా లేదంటే రిలీజ్ డేట్ మారుతుందా అనే చర్చ మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి హాలీవుడ్ సినిమాలు వరుసగా క్యూ కట్టడం ‘వారణాసి’కి డేంజర్ సిగ్నల్ లాంటిదే. ఎందుకంటే అక్కడ రిలీజ్‌కు ఆర్నెళ్ల ముందే ఐమాక్స్ స్క్రీన్స్ కోసం అగ్రిమెంట్స్ అయిపోతుంటాయి. ఇప్పటి వరకు వారణాసి వాయిదా పడుతుందనే విషయంపై ఏ సంకేతాలు లేవు. ప్రస్తుతానికైతే ముందుగా అనుకున్న తేదీకే ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ దగ్గర వారణాసికి అత్యంత కీలకమైన ఐమ్యాక్స్ రీచ్ కోసం అవసరమైతే మున్ముందు ఏ మార్పైనా జరగొచ్చు. వారణాసి గ్లోబల్ రీచ్ కోసం రాజమౌళి తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు.. కాంప్రమైజ్ కూడా కారు. కానీ ఇప్పటికైతే వారణాసిని ఏప్రిల్ 7న ఫిక్స్.. అప్పటి పరిస్థితులను బట్టి ఆ పోటీకి తగ్గట్లు జక్కన్న ఏం చేస్తారో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?

అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!

డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *