Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు10లోకి యాంకర్‌ శ్రీముఖి లవర్.. వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చాడుగా

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు10లోకి యాంకర్‌ శ్రీముఖి లవర్.. వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చాడుగా


Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు10లోకి యాంకర్‌ శ్రీముఖి లవర్.. వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చాడుగా

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ మళ్లీ ముస్తాబవుతోంది. ఈసారి తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఇక తెలుగులో అయితే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుని పదో సీజన్ లోకి అడుగు పెడుతోందీ రియాలిటీ షో. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి హౌస్ లో మరిన్ని హంగులు, ప్రత్యేకతలతో ముస్తాబవుతోంది. అలాగే గేమ్స్, టాస్క్ ల్లోనూ సరికొత్త స్ట్రాటజీని అమలు చేయనున్నారు. త్వరలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా ప్రారంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాగ్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, జబర్దస్త్ కమెడియన్ల పేర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్‌హిట్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు ఫేమ్ బాలు అలియాస్ విష్ణుకాంత్ కూడా ఈ సారి బిగ్ బాస్ లోకి రానున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వయంగా విష్ణుకాంత్ ఈ విషయంపై స్పందించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు.

‘తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం.. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను మన ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ వదిలేసి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కి వెళ్తున్నానని సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న రీల్స్, పోస్టుల ను మీరంతా చూసే ఉంటారు. నేను కూడా చూశాను.. వాటిని చూస్తే దగ్గర దగ్గర 4 వేల మంది కామెంట్స్ చేశారు. అలాగే చాలా మంది నాకు కూడా పర్సనల్‌గా మెసేజ్ చేశారు. అది చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్‌లో బాలు గారు మీరు సీరియల్‌ను వదిలేసి వెళ్లకండి. మీరు వెళ్లిపోతే ఆ స్థానంలో మరొకరిని చూడలేమంటూ చాలామంది చాలా ప్రేమతో కామెంట్స్ చేశారు’

‘నేను బిగ్‌బాస్‌కి వెళ్లడం లేదు.. మీరందరూ కోరుకుంటున్నట్లు బాలు లాగే మీ ముందు ఉంటాను. బాలు లాగానే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. మీరు నా పైనా, మన సీరియల్ పైన ఎంత ప్రేమ పెట్టుకున్నారని దానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు మన సీరియల్‌ని చాలా సపోర్ట్ చేసి మంచి ప్లేస్‌లో పెట్టారు. ఇకముందు కూడా మీరు అలాగే సపోర్ట్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు విష్ణుకాంత్. తద్వారా తాను బిగ్‌బాస్‌కి వెళ్లడం లేదని కరాఖండిగా చెప్పేశాడు. ప్రస్తుతం బాలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలు షేర్ చేసిన వీడియో..

 

View this post on Instagram

 

A post shared by 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐁𝐚𝐥𝐮 (@vishnuvk.official)

కాగా యాంకర్ శ్రీముఖి- బాలుల జోడీకి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది.   ముఖ్యంగా ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’షోలో వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *