Headlines

Gold Prices: బంగారం ధరలు ఒక్కసారిగా ఢమాల్.. ఉన్నట్లుండి కుప్పకూలిన రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..? | Gold Prices Fall After Three Day Rally: check rates in hyderabad, delhi and chennai on August 14 2026

Gold Prices: బంగారం ధరలు ఒక్కసారిగా ఢమాల్.. ఉన్నట్లుండి కుప్పకూలిన రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..? | Gold Prices Fall After Three Day Rally: check rates in hyderabad, delhi and chennai on August 14 2026


బంగారం కొనుగోలుచేసేవారికి భారీ ఊరట దక్కింది. మూడు రోజుల పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా గోల్డ్ రేట్లు ఎగబాకగా.. శుక్రవారం పతనమయ్యాయి. ఈ నెల ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే వస్తుండగా.. ఇవాళ స్వల్పంగా పడిపోయాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయికి ధరలు చేరుకుంటాయనే ప్రచారం క్రమంలో కాస్త శాంతించడం గోల్డ్ ప్రియులకు శుభవార్తగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కుప్పకూలడంతో దేశీయ మార్కెట్లోనూ అదే కొనసాగింది. అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆగస్ట్ 14న దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

ఇవాల్టీ బంగారం ధరలు ఇవే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,53,590 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,790గా కొనసాగుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,53,590గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,790 వద్ద ట్రేడవుతోంది

-చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,55,140 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,210గా ట్రేడవుతోంది.

-బెంగళూరూలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,590 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,790 వద్ద ట్రేడవుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,740 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,940గా ఉంది.

నేటి వెండి ధరలు ఇవే..

-వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. గురువారం దీని ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది.

-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,59,990 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.2.60 లక్షల వద్ద ట్రేడయింది.

-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద కొనసాగుతోంది. గురువారం రూ.2.60 లక్షల వద్ద కొనసాగింది.

-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఈ ధర రూ.23.55 లక్షలుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *