మార్వెల్ స్టూడియోస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ప్రోమోను మార్వెల్ స్టూడియోస్ విడుదల చేసింది. D23: ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్లో ఈ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు ఆస్కార్ అవార్డు విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, హేలీ అట్వెల్ వేదికపై ఈ ప్రత్యేక ప్రోమోను ఆవిష్కరించారు. ఈ ప్రోమోలో రాబర్ట్ డౌనీ జూనియర్ విక్టర్ వాన్ డూమ్/డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించారు. ఇప్పటివరకు ఐరన్ మ్యాన్‌గా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన రాబర్ట్ డౌనీ జూనియర్, ఇప్పుడు MCUలో అత్యంత శక్తివంతమైన విలన్‌గా కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది.
ఇది కూడా చదవండి : ఏంటీ.. ఈవిడా ఆమె ఒక్కరేనా..!! ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీ ఈ అమ్మడు
ప్రోమోలో సూ స్టార్మ్ పాత్రలో నటిస్తున్న వెనెస్సా కిర్బీ, డాక్టర్ డూమ్ విలన్‌గా మారే కథకు సంబంధించిన కీలక అంశాలను పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే డాక్టర్ డూమ్, థోర్ మధ్య భారీ పోరాటానికి సంబంధించిన సంకేతాలు కూడా ప్రోమోలో చూపించారు. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రానికి ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహిస్తున్నారు. కెవిన్ ఫైజీ, లూయిస్ డి’ఎస్పోసిటో, జోనాథన్ ష్వార్ట్జ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇది కూడా చదవండి : దొరికేసింది మావ..! అగ్నిపరీక్ష ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి బయట ఎలా ఉందో చూశారా..
ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్‌తో పాటు క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ, వెనెస్సా కిర్బీ, చానింగ్ టాటమ్, సిము లియు, ఇయాన్ మెక్‌కెల్లెన్, టామ్ హిడిల్స్టన్, జేమ్స్ మార్స్డెన్, ప్యాట్రిక్ స్టీవర్ట్, జోసెఫ్ క్విన్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మూడు విభిన్న విశ్వాలకు చెందిన హీరోలు ఒకే చోట కలుసుకుని, ఇప్పటివరకు ఎదుర్కోని అత్యంత ప్రమాదకరమైన ముప్పును ఎదుర్కొనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ 2026 డిసెంబర్ 18న భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.