Lifetime Free Credit Cards: క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న ఈ కాలంలో ఎటువంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుము లేకుండా ఉత్తమ రివార్డులు, ప్రయోజనాలను అందించే కార్డులను ఎంచుకోవడం చాలా కీలకం. 2026 సంవత్సరానికి గాను, యెస్ బ్యాంక్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్, ఏయూ లిట్ క్రెడిట్ కార్డ్, ఆర్‌బిఎల్ బ్యాంక్ షాప్‌రైట్ క్రెడిట్ కార్డ్ అనే మూడు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ కార్డులు వాటి ప్రత్యేకమైన ఫీచర్లు, విస్తృత ప్రయోజనాలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: POP Ceiling: రేకుల ఇంటికి ఏ సీలింగ్ బెస్ట్? జిప్సం, పీవీసీ, థర్మాకోల్ సీలింగ్స్‌కు ఎంత ఖర్చు.. ప్రయోజనాలు ఏంటి?
1. యెస్ బ్యాంక్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్:
ఈ కార్డ్ ఎటువంటి జాయినింగ్ లేదా వార్షిక రుసుము లేకుండా లభిస్తుంది. ఇది ఒక రూపే క్రెడిట్ కార్డ్, అంటే యూపీఐకి లింక్ చేసుకుని నేరుగా పేమెంట్లు చేయవచ్చు.
ఇవి కూడా చదవండి
- రివార్డులు: ఆన్‌లైన్ షాపింగ్‌పై 10% రివార్డులు (పాప్ కాయిన్స్) లభిస్తాయి. ఉదాహరణకు, రూ.10,000 షాపింగ్‌పై 1000 పాప్ కాయిన్స్ వస్తాయి. పాప్ యూపీఐ యాప్‌కు ఈ కార్డును లింక్ చేసి పేమెంట్ చేస్తే 7% రివార్డులు, నార్మల్ యూపీఐ (క్రెడ్, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే) ద్వారా పేమెంట్ చేస్తే 2% రివార్డులు లభిస్తాయి.
- పాప్ కాయిన్స్ రీడెంప్షన్: పాప్ యాప్‌లో 1000+ బ్రాండ్‌ల ద్వారా షాపింగ్ చేస్తే 1 పాప్ కాయిన్ రూ.1 విలువ ఉంటుంది. వోచర్‌లుగా (జొమాటో, బ్లింకిట్, ఫార్మ్‌ఈజీ, క్లియర్ ట్రిప్) రీడీమ్ చేసుకుంటే 4 పాప్ కాయిన్స్ రూ.1. బిల్ పేమెంట్ల (రీఛార్జ్, డీటీహెచ్, యుటిలిటీ బిల్లులు) కోసం 10 పాప్ కాయిన్స్ రూ.1. క్యాష్‌బ్యాక్‌గా మార్చుకుంటే 10 పాప్ కాయిన్స్ రూ.1.
- అదనపు ప్రయోజనాలు: పాప్ యాప్ బ్రాండ్‌లపై 50% వరకు డిస్కౌంట్లు. జాయినింగ్ బెనిఫిట్‌గా 3 నెలల జొమాటో గోల్డ్ ఉచితం, 3 నెలల ఫార్మ్‌ఈజీ మెంబర్‌షిప్, క్లియర్ ట్రిప్‌పై రూ.750 ఫ్లైట్ డిస్కౌంట్ లభిస్తాయి. రిఫరల్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
2. ఏయూ లిట్ క్రెడిట్ కార్డ్:
ఇది కూడా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్, వార్షిక రుసుములు లేవు. ఈ కార్డ్ ప్రత్యేకత ఏంటంటే, వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా ప్రయోజనాలను కస్టమైజ్ చేసుకోవచ్చు.
- కస్టమైజబుల్ ప్రయోజనాలు: మీరు ఎక్కువగా ప్రయాణిస్తే, ట్రావెలింగ్ సంబంధిత ఆఫర్‌లు (ఫ్లైట్, హోటల్ డిస్కౌంట్లు, లాంజ్ యాక్సెస్) వచ్చేలా కార్డును సెట్ చేసుకోవచ్చు. షాపింగ్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తే, షాపింగ్ డిస్కౌంట్లు వచ్చేలా మార్చుకోవచ్చు. ఈ కస్టమైజేషన్‌కు త్రైమాసిక రుసుము వర్తిస్తుంది.
- భాగస్వామి ఆఫర్లు: క్రోమాలో రూ.15,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే నెలకు ఒకసారి 5% తక్షణ డిస్కౌంట్. ఈజీడైనర్‌పై రూ.2500 ఖర్చు చేస్తే 15% ఆఫ్ (గరిష్టంగా రూ.500). టాటా క్లిక్‌పై రూ.500 ఖర్చు చేస్తే 15% ఆఫ్ (గరిష్టంగా రూ.300). క్లియర్ ట్రిప్‌పై అంతర్జాతీయ విమాన టికెట్లపై 10% ఆఫ్, దేశీయ విమాన టికెట్లపై 15% ఆఫ్. మూవీ టికెట్లపై రూ.500 ఖర్చు చేస్తే 20% వరకు డిస్కౌంట్ (గరిష్టంగా రూ.100).
3. ఆర్‌బిఎల్ బ్యాంక్ షాప్‌రైట్ క్రెడిట్ కార్డ్:
ఇది కూడా వార్షిక లేదా జాయినింగ్ ఫీజు లేని లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్.
- రివార్డులు: కిరాణా ఖర్చులపై ప్రతి రూ.100కి 20 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇతర ఖర్చులపై ప్రతి రూ.100కి 1 రివార్డ్ పాయింట్ లభిస్తుంది.
- డిస్కౌంట్లు: జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి వాటిపై అదనపు డిస్కౌంట్లు. బుక్‌మైషోపై 10% డిస్కౌంట్ (గరిష్టంగా రూ.100, సంవత్సరానికి 15 సార్లు). పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై సర్చార్జ్ మినహాయింపు.
ముఖ్యమైన సూచనలు:
క్రెడిట్ కార్డులను ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి, పరిమితిలో 30% కంటే తక్కువ ఉపయోగించాలి, గడువు తేదీలోపు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించడం వలన అధిక వడ్డీ భారం పడుతుంది. కార్డును అదనపు ఆదాయ వనరుగా కాకుండా, కేవలం చెల్లింపు సౌకర్యంగా మాత్రమే చూడాలి. దరఖాస్తు చేసే ముందు అన్ని నిబంధనలు మరియు షరతులను ధృవీకరించుకోవాలి.
ఇది కూడా చదవండి: Best Scheme: కేవలం రూ.250 పెట్టుబడితో మొదలు పెడితే చేతికి రూ.40 లక్షలు.. కాసులు కురిపించే ప్రభుత్వ స్కీమ్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి