తెలుగు సినీ దర్శకుడు కృష్ణవంశీ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్, నటన, వివాదాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. 1995లో గులాబి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా, సిందూరం, అంతఃపురం, ఖడ్గం, రాఖీ, గోవిందుడు అందరివాడేలే వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఆయన రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు అందుకున్నారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుతో గతంలో జరిగిన వివాదంపై కృష్ణవంశీ స్పష్టతనిచ్చారు. ఆ సమయంలో తాను కొంచెం తొందరపడ్డానని అంగీకరించారు. “నాకు కోటాగారు అంటే చాలా రెస్పెక్ట్. ఆయన ఎఫిషియంట్, బ్యూటిఫుల్ యాక్టర్” అని ఆయన అన్నారు. “తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత ఉంది, ఇంకా ఎక్కువ మంది ఆర్టిస్టులు కావాలి” అని తాను అన్న వ్యాఖ్యను కోట శ్రీనివాసరావు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. గోగినేని ప్రసాద్‌తో కలిసి ఆర్టిస్టుల కోసం ఒక వెబ్‌సైట్ ప్రారంభించే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశానని, అది ఒక అపోహకు దారి తీసిందని కృష్ణవంశీ తెలిపారు. కోట శ్రీనివాసరావు ప్రతిచర్యను తాను అర్థం చేసుకోగలనని, అయినా ఆయన పట్ల తన గౌరవం అలాగే ఉంటుందని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
అంతఃపురంలో జగపతిబాబు అద్భుతమైన నటన..
అంతఃపురం సినిమాలో జగపతిబాబు నటన గురించి కృష్ణవంశీ ప్రస్తావించారు. ఆ సినిమాలో జగపతిబాబు చేసిన పాత్రకు ఐదు రోజుల పాటు ప్రతి రెండు, మూడు గంటలకు ఒక టెక్విలా ఇచ్చానని తానే స్వయంగా వెల్లడించారు. జగపతిబాబు తనను తాను నియంత్రించుకోగల సామర్థ్యం ఉండటంతో, టెక్విలా వల్ల కొన్ని నిషిద్ధాలు, ముసుగులు తొలగిపోయి, అద్భుతమైన నటనను ప్రదర్శించారని వివరించారు. “ఒక టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆ జోన్ లోకి తీసుకెళ్లటం డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ” అని, “నటుడిని ఇతరులను అనుకరించేలా కాకుండా, తన భావోద్వేగాలను సహజంగా పలికించేలా చేయడమే దర్శకుడి పని” అని ఆయన చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
జగపతిబాబు పాత్రకు మొదట రవితేజను అనుకున్నారా అనే ప్రశ్నకు, కృష్ణవంశీ స్పందిస్తూ. జగపతిబాబు అల్టిమేట్‌గా, ఔట్ ఆఫ్ ది వరల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని, ఆయన పాత్రలో తాను పూర్తిగా లీనమైపోయానని ప్రశంసించారు.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..