Headlines

OTT Movie: ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. సునీల్ యాక్టింగ్ కోసమైనా చూడాలి | Malayalam Action Thriller Ananthan Kaadu Movie Is Now Streaming On These 5 OTT Platforms


సాధారణంగా సినిమాలు ఒకటి లేదా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు వస్తాయి. అయితే ఒక సూపర్ హిట్ సినిమా ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చేసింది. కోలీవుడ్ వర్సటైల్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘అనంతన్ కాడు’. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, రెజీనా కసాండ్రా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ మలయాళం వెర్షన్ తో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ సినిమా స్టోరీ కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. పేరుకు గ్యాంగ్ స్టర్ డ్రామానే అయినప్పటికీ 90ల నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. 1990ల కాలంలో తిరువనంతపురంలో స్థానిక వీధి రౌడీలు ఒక ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు శ్రీలంక తమిళ తిరుగుబాటుదారుడితో చేతులు కలపడం, ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. హీరో ఆర్య ఈ సినిమాలో శ్రీలంక తమిళన్ పాత్రలో కనిపించడం విశేషం. సినిమాలో ఆయన లుక్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.


ఇవి కూడా చదవండి



పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘తియాన్’ చిత్రం తర్వాత దర్శకుడు జియేన్ కృష్ణకుమార్, రచయిత మురళి గోపి మళ్లీ కలిసి పనిచేసిన ప్రాజెక్ట్ ‘అనంతన్ కాడు’. హీరో ఆర్యతో పాటు టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్, రెజినా కసాండ్రా, అజయ్, నిఖిలా విమల్, దేవ్ మోహన్, ఇంద్రన్స్, విజయ రాఘవన్, అచ్యుత్ కుమార్, శాంతి బాలచంద్రన్ వంటి ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఏకంగా ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్ గేట్ ప్లే, మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి అనంతన్ కాడు ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు.

ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్..

అనంతన్ కాడు సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *