Headlines

ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ | Bajaj Auto to Launch Its First Electric Motorcycle Next Financial Year: Q1 Results and Growth Details!

ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ | Bajaj Auto to Launch Its First Electric Motorcycle Next Financial Year: Q1 Results and Growth Details!


చేతక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈవీ ఆదాయం రెట్టింపు కావడంతో, బజాజ్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 60,000 యూనిట్లకు పెంచుతోంది. రికార్డు స్థాయిలో రూ. 3,000 కోట్లకు పైగా నికర లాభం సాధించిన బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ వివరాల పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం!

ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలోకి..

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ మరియు హీరో వంటి బ్రాండ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న తరుణంలో, బజాజ్ ఆటో ముందుగానే మోటార్ సైకిల్ విభాగాన్ని ఆక్రమించాలని గట్టిగా భావిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం బజాజ్ విక్రయిస్తున్న ‘చేతక్’ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో బజాజ్ మొత్తం స్థానిక వ్యాపార ఆదాయంలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఏకంగా 30 శాతానికి చేరింది. చేతక్‌కు వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం నెలకు 50,000 యూనిట్లుగా ఉన్న ప్రొడక్షన్ కెపాసిటీని రాబోయే కొద్ది నెలల్లో 60,000 యూనిట్లకు పెంచాలని యోచిస్తోంది.

ఆర్థిక ఫలితాలు

ఆర్థిక పరంగా కూడా బజాజ్ ఆటో ఈసార సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏటా 37 శాతం పెరిగి రూ. 17,244 కోట్లకు చేరింది. అలాగే పన్నుల తర్వాత నికర లాభం 40 శాతానికి పైగా పెరిగి దాదాపు రూ. 3,000 కోట్లను దాటడం విశేషం. ఎగుమతుల విషయానికి వస్తే, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో భారీ విక్రయాలు నమోదు కావడంతో కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 7 లక్షలకు పైగా ఎగుమతుల మార్కును దాటింది.

ముఖ్యంగా నైజీరియాలో మూడు రెట్ల వృద్ధి నమోదైంది. ఈ భారీ లాభాలు, మార్కెట్ ప్రోత్సాహంతోనే బజాజ్ తమ ఈవీ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల మార్కెట్‌ను శాసించేందుకు బజాజ్ ఆటో సిద్ధమవుతోంది. అద్భుతమైన ఆర్థిక వృద్ధి మరియు పటిష్టమైన ప్రణాళికలతో దూసుకెళ్తున్న బజాజ్ ఈవీ దూకుడు టెక్ మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *