అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది వేస్తే పొట్టు ఈజీగా ఊడిరావడం పక్కా..
గుడ్లు ఉడకబెట్టే సమయంలో నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా లేదా కొన్ని చుక్కల వెనిగర్ వేస్తే పెంకు ఈజీగా ఊడివస్తుంది. ఈ చిట్కా వెనుక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది. తాజా గుడ్లలో ఆమ్లత ఎక్కువగా ఉండటం వల్ల తెల్లసొన పెంకు లోపలి పొరకు గట్టిగా అతుక్కుంటుంది. నీటిలో బేకింగ్ సోడా కలిపినప్పుడు అది క్షారత్వాన్ని పెంచి లోపలి పొరను వదులు చేస్తుంది. అదే వెనిగర్ అయితే అందులోని ఆమ్లం పెంకులోని కాల్షియంను మెత్తబరుస్తుంది. బేకింగ్…