ఎవరీ సారాంశ్ జైన్..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి.. ఏం చూసి ఇతన్ని ఎంపిక చేశారంటే? | Who Is Saransh Jain? Meet India’s Surprise Test Pick Replacing Washington Sundar for Sri Lanka Series
శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. గాయంతో తొలి టెస్టుకు అందుబాటులో లేని వాషింగ్టన్ సుందర్ స్థానంలో బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. దీంతో దశాబ్దానికి పైగా దేశీయ క్రికెట్‌లో కష్టపడి రాణించిన సారాంశ్‌కు తొలి అంతర్జాతీయ పిలుపు లభించింది. ఇండోర్‌కు చెందిన 33 ఏళ్ల సారాంశ్ జైన్ కుడిచేతి ఆఫ్‌స్పిన్ బౌలర్. అవసరమైన సమయంలో విలువైన పరుగులు చేసే…