హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత ఆపరేషన్.. 18,600 అడుగుల ఎత్తులో అద్భుత రెస్క్యూ..! | Indian Army daring rescue operation from 18,600 ft in strong winds near Himalaya Mountains
లడఖ్‌లోని నన్ కున్ పర్వత శ్రేణి సమీపంలో భారత సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన హై-ఆల్టిట్యూడ్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సుమారు 18,600 అడుగుల ఎత్తులో నిటారుగా ఉన్న కొండవాలు నుంచి ఓ రోగిని సైనిక విమానయాన సిబ్బంది సురక్షితంగా తరలించారు. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలను భారత సైన్యానికి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ రెస్క్యూ మిషన్‌కు ఎన్నో సవాళ్లు…