Headlines

Telangana: తెలంగాణ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. నవంబర్‌లోగా అందరికీ ఉచిత అల్పాహారం

ఉదయం పూట ఆకలితో తరగతులకు వచ్చే విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపడంతోపాటు వారికి పౌష్టికాహారం అందించడం, పాఠశాలల హాజరు శాతాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంటోంది. దశలవారీగా అమలు చేస్తున్న ఈ పథకంలో ప్రస్తుతం రెండు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. తొలి దశలో జూన్ నెలలో ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రీకృత వంటశాలల ద్వారా 1,269 ప్రభుత్వ పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీలకు అల్పాహారం సరఫరా ప్రారంభించారు. ఈ…

Read Full News

PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్ ఇదే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లలో పర్యటించనున్నారు. మధ్య ఆసియా దేశాలతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన సాగనుంది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్‌లో పర్యటించనున్నారు.. ఉజ్బెకిస్తాన్‌ లో ప్రధాని మోదీకి ఇది నాలుగోసారి పర్యటన. గతంలో 2015, 2016, 2022లో కూడా మోదీ…

Read Full News

Rain Alert: అల్ప పీడనం ఎఫెక్ట్.. రానున్న 24 గంటల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! | Hyderabad and Telangana Rain Alert: Low Pressure in Bay of Bengal to Bring Showers Across State

తెలంగాణలో రైతంగానికి హైదరాబాద్ వాతావరణం కేంద్ర చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. ప్రస్తుతం సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్‌సర్, అంబాలా, ముజఫర్‌నగర్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లోని అల్పపీడన ప్రాంతం, రాంచీ, దిఘా మీదుగా ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని.. గురువారం తెల్లవారుజామున 05:30 గంటల సమయంలో తెలంగాణ, రాయలసీమ సరిహద్దుల్లో ఏర్పడిన…

Read Full News

Diabetes Toothpaste: షుగర్ ఉన్నవారు తియ్యటి టూత్‌పేస్ట్ వాడొచ్చా? ఇదే అసలు విషయం!

డయాబెటిస్ ఉన్నవారు నోటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల చిగుళ్ల సమస్యలు, నోరు పొడిబారడం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందుకే టూత్‌పేస్ట్ ఎంపిక చేసేటప్పుడు రుచి కంటే అందులో ఉన్న పదార్థాలు, ముఖ్యంగా ఫ్లోరైడ్ ఉందా లేదా అనేది చూడటం మంచిది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, పళ్ల మధ్య శుభ్రం చేసుకోవడం, అవసరమైతే దంత వైద్యుడిని సంప్రదించడం కూడా ముఖ్యమే. 1….

Read Full News

90’s Monsoon: వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు

ఆనాటి వర్షపు రోజులను, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరి పెదవులపై చిరునవ్వు విరుస్తుంది. ఆకాశంలో మబ్బులు పట్టి భారీ వర్షం పడుతుంటే.. “ఇవాళ్టికి స్కూలు వద్దులే ఇంట్లోనే ఉండు” అని ఇంట్లో పెద్దలు చెప్పగానే ఎక్కడలేని సంతోషం కలిగేది. రోజంతా టీవీ ముందు కూర్చుని కార్టూన్లు చూస్తూ గడపడం, ఒకవేళ తప్పక స్కూలుకు వెళ్లాల్సి వస్తే కలర్‌ఫుల్ రెయిన్‌కోట్లు, గొడుగులు వేసుకుని వెళ్లడం ఎంతో సరదాగా ఉండేది. అప్పుడు సగం క్లాస్ ఖాళీగా ఉండేది. ఇక…

Read Full News

Indian Railways: రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే.. | Indian Railways New Rules: These Activities Can Attract Rs 1,000 Fine

రైలు ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో చెత్త వేస్తే ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే తాజాగా పరిశుభ్రత నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చెత్త వేయడం, ఉమ్మివేయడం, రైల్వే ఆస్తులను పాడు చేయడం వంటి చర్యలకు విధించే గరిష్ఠ జరిమానాను రూ.500 నుంచి రూ.1,000కి పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 24న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వచ్చాయి. రైలు బోగీలు, రైల్వే స్టేషన్లలను…

Read Full News

మెడికల్ కాలేజీలో ఘోరం.. అప్పుడే పుట్టిన 60 మంది చిన్నారులు మృతి! ఒక్క రోజులోనే 10 మంది.. | 60 Children Die at Malda Medical College in West Bengal, 10 Children Die in a Single Day

మాల్దా, ఆగస్ట్‌ 27: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (MMCH)లో చిన్నారుల మరణాలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆగస్టు నెలలో తొలి మూడు వారాల్లో ఆసుపత్రిలో 60 మంది చిన్నారులు మృతి చెందడం ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా రెండో వారంలో ఒకే రోజున 10 మంది చిన్నారులు మరణించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరణాత్మక…

Read Full News

Cinema : దెయ్యాలు, ఉత్కంఠ.. ఊహించని మలుపులతో సాగే హారర్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది.. యూట్యూబ్ లోనూ చూడొచ్చు..

హారర్ థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. సినిమా ఏ భాషలో ఉన్నా సరే, కథ, సస్పెన్స్ ఆకట్టుకుంటే అడియన్స్ ఆ చిత్రాన్ని వెతుకుతారు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పెరగడంతో భాషా అంతరం కూడా తగ్గింది. అందుకే ఇప్పుడు ఇతర భాషల సినిమాలను కూడా సబ్‌టైటిల్స్‌తో సులభంగా చూస్తున్నారు. కానీ అందరికీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉండదు. అలాంటి ప్రేక్షకులకు, యూట్యూబ్‌లో ఉచితంగా లభించే 'కళింగ' సినిమా ఒక మంచి ఎంపిక కావచ్చు. కళింగ…

Read Full News

అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సంపంగి హీరోయిన్

సినీ రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్‌లుగా ఎన్నో సినిమాల్లో నటించి, మంచి స్టార్‌డమ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటారు. ఆ తర్వాత వయసు పెరుగుతుండటంతో అవకాశాలు తగ్గిపోతుంటాయి. అప్పుడు కొందరు సినిమా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుని కొంతకాలం దూరంగా ఉంటారు. ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టులుగానో, టీవీ సీరియల్స్ ద్వారానో తిరిగి వస్తూ తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెడతారు. అలాంటి వారిలో సంపంగి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కాంచీ కౌల్ ఒకరు. కాంచీ కౌల్ అనగానే…

Read Full News

రాఖీ పండగ మాత్రమే కాదు.. శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ గొప్ప వైదిక సంప్రదాయం గురించి తెలుసా? | Raksha Bandhan 2026: Know the Vedic Significance of Upakarma on Shravan Purnima

Upakarma on Shravan Purnima Telugu: శ్రావణ పౌర్ణమి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రాఖీ పండగ. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకుంటుంది. ప్రేమ, అనుబంధం, రక్షణకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే శ్రావణ పౌర్ణమికి ఇంతటితోనే ప్రత్యేకత ముగియదు. మన వైదిక సంప్రదాయంలో ఈ రోజుకు మరో విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. కొన్ని వైదిక సంప్రదాయాల్లో ఈ సందర్భంగా ఉపాకర్మ అనే…

Read Full News