Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. ట్రాఫిక్ రద్దీయే ఉండదు.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..
హైదరాబాద్ ప్రజలకు మరో సూపర్ న్యూస్. నగరంలో ప్రముఖ పార్క్‌గా ప్రసిద్ది పొందిన కేబీఆర్ పార్క్ వద్ద రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఈ పార్క్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి ముందడుగు వేసింది. మొత్తం 14 నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఏడు ప్రధాన కూడళ్ల వద్ద ఈ నిర్మాణాలు జరగనున్నాయి. మొన్నటివరకు కోర్టు కేసులు, భూసేకరణ ప్రక్రియ వల్ల…