మైనర్లు, యువకులే అతని టార్గెట్.. ఫోన్లో 600 వీడియోలు! 4 ఏళ్లుగా ఇదే పని
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువకులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతూ, వారి వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు 2022 నుంచి ఈ వ్యవహారానికి పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. నందుర్బార్ జిల్లాలోని రైసింగ్‌పురాకు చెందిన చేతన్ ప్రకాష్ కోలి అనే యువకుడు మైనర్లు, యువకులను డబ్బు ఆశ చూపి…