Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు | Famous Chef Sanjeev Kapoor’s kitchen tips that make your life easier
వంట చేయడం ఒక కళ. అయితే చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే అదే పని మరింత సులభంగా, వేగంగా పూర్తవుతుంది. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ వంటను సులభతరం చేసే కొన్ని ఉపయోగకరమైన కిచెన్ చిట్కాలను సూచించారు. కొత్తగా వంట నేర్చుకునేవారికే కాదు, అనుభవం ఉన్నవారికీ ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు. 1. ముందస్తు సన్నద్ధతే విజయం వంట మొదలుపెట్టే ముందు అవసరమైన పదార్థాలన్నింటినీ సరిగ్గా కొలిచి, కడిగి, తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. వంట చేయడం మొదలు…