తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..! | Good news regarding power for the Telugu states, Power generation begins at Srisailam
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్‌లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం వైపు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. దీనివల్ల విద్యుత్ సరఫరా పరిస్థితుల్లో కొంతమేర ఊరట లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని…