మత్తోన్మాదులు.. మెడికల్ విద్యార్థినిని 3 సార్లు కారుతో ఢీకొట్టారు.. సంచలన విషయాలు.. | Rajahmundry: Drunk Car Driver Allegedly Hits Medical Student Three Times, Shocking CCTV Details Emerge
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పించినా..జరిమానాలు విధించినా.. జైలు శిక్షలు వేయించినా..కొంతమంది తాగుబోతుల్లో మార్పు కూడా రావడం లేదు. మత్తు తలకెక్కి..వేగం అదుపుతప్పి.. అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. టెర్రరిస్టుల కంటే ప్రమాదకరంగా మారుతున్నారు. లేటెస్ట్‌గా రాజమండ్రిలో ఓ ‘మత్తో’న్మాది..వైద్య విద్యార్థిని బలి తీసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. దీనికి సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది…