ఇదేం ట్రాఫిక్ బాబోయ్.. 4 కిలోమీటర్లకు 47 నిమిషాలా..? ఈ రోజు బయల్దేరితే రేపటికి చేరుతాం! | Bengaluru Traffic Chaos: 4 Km Journey Takes 47 Minutes, Internet Reacts
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆదిత్య సక్సేనా అనే నెటిజన్ షేర్ చేసిన గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో కేవలం 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏకంగా 47 నిమిషాల సమయం పడుతుందని చూపిస్తోంది. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఈ ట్రాఫిక్ నరకంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, మీమ్స్‌తో స్పందిస్తున్నారు. బెంగళూరులో ఐటీ వృద్ధికి సమానంగా మౌలిక వసతులు పెరగకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని…