Headlines

Hyderabad: హైదరాబాద్‌‌లో నైట్‌ షిఫ్ట్‌.. మన నగరం ఎంత వరకు సేఫ్.. | Hyderabad May Soon Get Night Bus Services: Will They Make Night Travel Safer for Employees?

హైదరాబాద్‌ ఇప్పుడు పగలు మాత్రమే పనిచేసే నగరం కాదు. రాత్రి కూడా పరుగులు తీస్తున్న నగరం.. ఐటీ, బీపీవో, ఆస్పత్రులు, హోటళ్లు, ఎయిర్‌పోర్ట్‌, డెలివరీ, సెక్యూరిటీ వంటి రంగాల్లో వేలమంది రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత కూడా ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటకు వస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో నైట్‌ బస్‌ సర్వీసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాత్రి 10 గంటల…

Read Full News

టీమ్‌ మీటింగ్‌లో రచ్చ.. గంభీర్‌ను ఏకిపారేసిన గిల్.. అసలేం జరిగింది? | Gill gambhir rift bcci meeting strategy wtc impact

Shubman Gill vs Gautam Gambhir: శ్రీలంకతో రెండో టెస్టు డ్రాగా ముగియడం టీమ్‌ఇండియాకు నిరాశ కలిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సాధించినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశంలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్, ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. గిల్‌.. గంభీర్‌ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రశ్నించినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. బౌలర్లపై గంభీర్‌…

Read Full News

రాఖీ పండుగ వేళ.. రూ.5వేల బిల్లుకు.. రూ.3 వేల ‘వెయిటింగ్ ఛార్జీ’.. బిల్లు అడిగితే బాదేశారు..! | Rakhi Fest Shock: Hyderabad Restaurant Charges rs 3000 Extra, Assaults Family Questioning Bill

హైదరాబాద్‌: నారాయణగూడలో రాఖీ పండుగ సందర్భంగా ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌ బిల్లులో అదనంగా రూ.3 వేల ‘వెయిటింగ్, డెలివరీ ఛార్జీ’ విధించడాన్ని ప్రశ్నించడంతో వివాదం తలెత్తి, చివరకు దాడికి దారితీసింది. ఈ ఘటనపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల ఆశిష్‌ పోర్వాల్‌ తన సోదరుడు రాహుల్‌, సోదరి కీర్తితో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మరో 15-20 మంది కుటుంబ సభ్యులతో…

Read Full News

రోజా పూల సాగుతో రాజాలా మారిన రైతు జీవితం.. జీతంలా ప్రతినెల ఆదాయం | Flower Farming: Daily Income & Success for Guntur Farmer Alla Shivanjaneyulu

సాధారణ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి, పంట చేతికి వచ్చే వరకు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. కానీ, పూల సాగులో మాత్రం ప్రతిరోజూ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు అల్లా శివాంజనేయులు తమ విజయగాథ ద్వారా నిరూపిస్తున్నారు. ఆయన పూల సాగును ప్రభుత్వ ఉద్యోగి జీతంలా నిత్య ఆదాయ వనరుగా మలచుకొని, ప్రతి నెలా స్థిరమైన సంపాదన పొందుతున్నారు. శివాంజనేయులు రెండేళ్ల క్రితం 70 సెంట్లలో…

Read Full News

కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్స్.. అబ్బబ్బ.. దీన్ని మించిన సూపర్‌ఫుడ్ ఏదీ లేదు..

రాగులలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. రాగులను రెగ్యులర్‌గా తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరానికి ఎంతో బలాన్నివ్వడంతోపాటు.. ఎముకలు బలపడటానికి సహాయపడుతాయి.. అంతేకాకుండా రక్తహీనత తగ్గడంతోపాటు.. మధుమేహం అదుపులో ఉంటుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. అయితే.. రోజూ రాగి జావ లేదా సంకటి లేదా రొట్టెల రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయని.. పలు సమస్యలను కూడా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగి జావ –…

Read Full News

Bigg Boss 10 Telugu: వారెవ్వా.. ఈసారి షో అదిరిపోద్ది.. బిగ్ బాస్ 10లోకి అందాల ముద్దుగుమ్మలు.. ఫైనల్ లిస్ట్ ఇదే.. | Bigg Boss 10 Telugu These Contestants Are May Final To Enter Bigg Boss House, Check Here Details

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ 10వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. గత తొమ్మిది సీజన్లుగా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తున్న ఈ షో, ఇప్పుడు పదవ సీజన్‌తో కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతోంది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, మూడో సీజన్ నుండి కింగ్ అక్కినేని నాగార్జున తనదైన శైలిలో షోను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ 10వ సీజన్‌కు…

Read Full News

“ఖార్గ్ ద్వీపం పూర్తిగా ధ్వంసం” ట్రంప్ సంచలన ప్రకటన..! హోర్ముజ్‌లో హై టెన్షన్..! | US president Donald Trump says Iran’s Kharg is being blown to smithereens

వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వారాలపాటు కొనసాగిన సాపేక్ష ప్రశాంతతకు తెరదించుతూ అమెరికా ఇరాన్‌లోని లారక్ ద్వీపంపై రెండు క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ప్రయోగించేందుకు ఇరాన్ దళాలు సిద్ధమవుతున్నట్లు గుర్తించడంతో ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది….

Read Full News

Tollywood : హీరో చిరంజీవి.. కానీ నాకే 40 సీన్స్ పెట్టారు.. 515 రోజులు ఆడిన సినిమా అది.. టాలీవుడ్ నటుడు.. | Gollapudi Maruti Rao Once About His Iconic Villain Role in Chiranjeevi Intlo Ramayya Veedilo Krishnayya

తెలుగు చిత్రసీమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో ఆయన పోషించిన ప్రతినాయక (విలన్) పాత్ర టాలీవుడ్ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఈ సినిమా గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో గొల్లపూడి వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు విశేషంగా నిలిచాయి. గొల్లపూడి మారుతిరావు తన విలక్షణమైన…

Read Full News

నేపాల్‌ వరదల్లో అద్భుతం.. దేవదూతల మారిన దున్నపోతు! నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఇలా.. | Man Stranded in Nepal Flood Rides Buffalo to Safety as Terrifying Rescue Video Goes Viral

ప్రకృతి కోపానికి ఎదురునిలవడం మనిషికి ఎప్పుడూ కష్టతరమే. ముఖ్యంగా వరదలు, కొండచరియలు విరిగిపడే సమయంలో నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఇటీవల నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ బీభత్సం సృష్టించాయి. ఇటువంటి విపత్తు సమయంలో ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసం, ప్రదర్శించిన సమయస్ఫూర్తి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఉధృత ప్రవాహంలో అద్భుత ఘట్టం: నేపాల్‌లోని ఒక నది వద్ద వరద నీరు మహోగ్రంగా ప్రవహిస్తోంది. ఆ హోరెత్తే…

Read Full News

దేశ అభివృద్ధిలో విద్య, విజ్ఞానం కీలక పాత్ర.. పదేళ్లలో ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులు.. | India’s Higher Education Sector and knowledge ecosystem sees a a Decade of Growth, Access, and Inclusion

న్యూఢిల్లీ: విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. దేశ అభివృద్ధిలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. గత దశాబ్దంలో భారత ఉన్నత విద్యా రంగం గణనీయమైన విస్తరణను నమోదు చేసింది. విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే అఖిల భారత ఉన్నత విద్యా సర్వే (AISHE) గణాంకాలు దేశంలో ఉన్నత విద్యకు పెరుగుతున్న ప్రాప్యత, మహిళల భాగస్వామ్యం, సామాజిక సమ్మిళితత్వం, STEM విద్య, మౌలిక సదుపాయాల్లో వచ్చిన మార్పులను స్పష్టంగా…

Read Full News