Headlines

Viral Video: ఏందిరా సామి.. ఎక్స్‌ప్రెస్‌వే‌ను ఏకంగా డైనింగ్ హాల్‌గా మార్చేశారు కదరా..! | Viral Video: Rajasthan Expressway Dining Viral: Family Public Road Meal Sparks Safety Outrage

రాజస్థాన్‌లో ఇటీవల ప్రారంభమైన ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కుటుంబం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వాహనాల రాకపోకల కోసం నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేను ఏకంగా కుటుంబ భోజన కార్యక్రమానికి వేదికగా మార్చడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి మధ్యలోనే కుటుంబ సభ్యులు కూర్చొని భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ శివ్‌ మహేశ్వరి షేర్‌ చేసిన వీడియోలో.. ఓ కుటుంబానికి చెందిన పలువురు రోడ్డుకు అడ్డంగా కూర్చొని…

Read Full News

కర్కాటక రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: సెప్టెంబర్ రెండో భాగంలో భారీ శుభయోగాలు | September 2026 Horoscope: Cancer to See Major Success and Career Growth in the Second Half

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారికి ద్వితీయార్థం నుంచి మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. రవి, కుజులతో పాటు శుక్రుడి అనుకూలత కూడా పెరగడంతో రాజయోగాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఏ రంగంలో ఉన్నవారైనా విజయాలు, సాఫల్యాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. నెల ప్రథమార్థంలో ఇంటా, బయటా కొంత ఒత్తిడి ఎదురైనా ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు…

Read Full News

Astrology: సెప్టెంబర్‌లో 4 అరుదైన రాజయోగాలు.. ఈ 5 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం! మీ రాశి ఇదేనా? | September 2026: 4 Powerful Raj Yogas to Bring Luck, Wealth and Career Growth for These 5 Zodiac Signs

Lucky Zodiac Signs in September 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సెప్టెంబర్ నెలలో పలు కీలక గ్రహ సంచారాలు జరగనున్నాయి. శుక్రుడు, బుధుడు తమ స్వరాశుల్లో సంచరించడంతో పాటు సూర్యుడు-బుధుడి కలయిక వంటి గ్రహస్థితుల కారణంగా మాలవ్య, భద్ర, బుధాదిత్య, లక్ష్మీ నారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజయోగం, సెప్టెంబర్ 7న బుధుడు కన్యారాశిలోకి రావడంతో భద్ర రాజయోగం ఏర్పడతాయి. ఇక సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి…

Read Full News

Telangana: భయాన్ని గెలిచి.. ప్రాణదాతగా మారి.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతు..

కామారెడ్డి జిల్లా ఆగస్ట్ 31: దేన్నైనా ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిచి చూపించాలి అంటుంటారు. అచ్చం అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు కామారెడ్డి జిల్లా జంగంపల్లికి చెందిన రైతు మోహన్ రెడ్డి. పాము కాటుతో తండ్రిని కోల్పోయిన విషాదాన్ని తన బలంగా మార్చుకుని, ప్రస్తుతం స్నేక్ క్యాచర్‌గా మారి వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి పాములంటే ఆమడ దూరం పరిగెత్తే మోహన్ రెడ్డి జీవితాన్ని ఒక విషాద…

Read Full News

Cinema : ఏం సినిమా భయ్యా.. ఓటీటీని షేక్ చేసిన మూవీ.. 32 కోట్లు పెడితే 450 కోట్లతో సెన్సేషన్..

కొన్ని సినిమాలు కాలం గడిచినా అభిమానులచే ఆదరించబడతాయి. ఇది అలాంటి చిత్రాలలో ఒకటి. ఉత్కంఠభరితమైన కథనం, మధ్యలో ఊహించని మలుపు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కారణంగా ఈ చిత్రం అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో రీమేక్ చేసి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఏ సినిమానో మీకు తెలుసా? మనం మాట్లాడుకుంటున్న సినిమా 'అంధాధున్' అనేది శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఒక హిందీ చిత్రం, ఇది 2018లో థియేటర్లలో…

Read Full News

Vaibhav Sooryavanshi: క్రికెట్లో 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 7 ఆల్‌టైమ్ రికార్డులు | Vaibhav sooryavanshi 7 unbelievable cricket records youngest ipl centurion duleep trophy

Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. చిన్న వయసులోనే ఎన్నో ఆశ్చర్యపరిచే మైలురాళ్లను అందుకున్న ఈ బీహార్ బుడ్డోడు, రాబోయే రోజుల్లో ఎవరూ బ్రేక్ చేయలేని 7 సంచలన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ విధ్వంసకర రికార్డుల వివరాలేంటో తెలుసుకుందాం. 1. ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన హాఫ్ సెంచరీ వీరుడు వైభవ్ సూర్యవంశీ తన 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే…

Read Full News

GATE 2027 రిజిస్ట్రేషన్ మళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే? | GATE 2027 Registration Postponed Again: IIT Madras to Announce Revised Dates Soon

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 31: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2027 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం మరోమారు వాయిదా పడింది. ఈ మేరకు ఐఐటీ మద్రాస్ (IIT Madras) దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 27న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభించలేదు. సవరించిన కొత్త తేదీల వివరాలను త్వరలోనే అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని…

Read Full News

నా భార్య అన్న చివరి మాటలివే.. యూకే వ్యక్తి కన్నీటి పర్యంతం | British Man Remembers Wifes Last Words Before Missing In Nepal Floods

నేపాల్ లో సంభవించిన సునామీ లాంటి భీకర వరద సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా జనం తేరుకోలేదు. కుటుంబసభ్యులను ఆప్తులను కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు.  చేతిలో ఫొటోలు పట్టుకుని శవాగారాలు ఆస్పత్రుల చుట్టూ కన్నీటితో తిరుగుతూనే ఉన్నారు.  నేపాల్ జల ప్రళయానికి నేటికి ఆరు రోజులు పూర్తవుతోంది.  శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. భారీ ఆకస్మిక వరద విపత్తులో ఇప్పటివరకు…

Read Full News

IRCTC Bali Package: బాలీ టూర్‌లో ఈ అద్భుత ప్రదేశాలన్నీ చూడొచ్చు.. పూర్తి టూర్ షెడ్యూల్ ఇదే! | IRCTC Bali Tour Package: 5 Day Bali Trip at Rs.94,700; Check Itinerary, Inclusions and Details

IRCTC Bali Tour Package Telugu: బాలీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్‌లు, పచ్చని వరి పొలాలు, ప్రాచీన హిందూ దేవాలయాలు, రిసార్టులు, నైట్‌లైఫ్‌తో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో IRCTC బాలీకి 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు కొనసాగుతుంది. చెన్నై నుంచి విమాన ప్రయాణంతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఎకానమీ…

Read Full News

ఏంట్రా బాబూ.. ఇంత సెన్సిటివ్ అయితే ఎట్లా.. పదో తరగతి విద్యార్థి బలవన్మరణం!

హైదరాబాద్‌ మహానగరం మియాపూర్‌ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మియాపూర్‌ సుభాష్‌చంద్రబోస్‌ నగర్‌లో మల్లికార్జున తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతడి తండ్రి పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల చదువుపై ఒత్తిడి, చదువు సరిగా…

Read Full News