బంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. సోమవారం ధరలు పెరగడంతో ఈ వారంలో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశముందనే అంచనాలు వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 17న బంగారం, వెండి ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660కి చేరుకోగా.. నేడు ఒక్కరోజే రూ.530 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,700 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.500 మేర పెరుగుదలను నమోదు చేసింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,120కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,190గా ట్రేడవుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,660 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,810గా ఉండగా.. సోమవారం ఒక్కరోజే రూ.530 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉండగా.. ఇవాళ రూ.500 పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,660గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,700గా ఉంది.
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ముంబైలో రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో కూడా ఇదే ధర పలుకుతుండగా.. హైదరాబాద్లో కేజీ వెండి రూ.2,54,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి రూ.2,54,900గా ట్రేడవుతోంది.




