Headlines

RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. సెప్టెంబర్‌ 13 వరకే ఛాన్స్! | RRB JE Recruitment 2026: Applications Open for 3,993 Railway Jobs, Check Eligibility and Salary


రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వశాఖ మరో తీపికబురు చెప్పింది. ఇండియన్‌ రైల్వేలో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3,993 జూనియర్ ఇంజినీర్ పోస్టులను దేశవ్యాప్తంగా వివిధ RRBలు, రైల్వే జోన్లు, ప్రొడక్షన్ యూనిట్ల పరిధిలో భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్‌ జోన్‌లో మొత్తం 110 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 13, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎస్‌ అండ్‌ టీ, స్టోర్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

RRB రైల్వేలో JE ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పోస్టును బట్టి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2027 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ తదితర కేటగిరీలకు నిబంధనల ప్రకారం అదనపు సడలింపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి



RRB రైల్వేలో JE ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 13, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)-I, ఆ తర్వాత CBT-II నిర్వహిస్తారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం లెవల్-6లో ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు రూ.35,400గా ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 13, 2026.
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2026.
  • దరఖాస్తు సవరణ విండో: సెప్టెంబర్ 16, 2026 నుంచి సెప్టెంబర్ 25, 2026 వరకు

RRB రైల్వేలో JE ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *