వినూత్నమైన కంటెంట్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ అందరి హృదయాల్లో తనదైన స్ధానాన్ని దక్కించుకున్న మోస్ట్ పాపులర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మరో ఒరిజినల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్షన్ మై లార్డ్’. శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్. ఈ సిరీస్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను రూపొందించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ ఒరిజినల్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కోర్ట్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్‌ను గమనిస్తే..ఓ లేడీ వాయిస్‌తో ట్రైలర్ మొదలవుతుంది..
ఆయన ప్రాబ్లెమ్ ఏంటి సర్? అని యంగ్ లేడీ లాయర్ అనన్య శ్రీకాంత్ గురించి మరో లాయర్‌ను అడుగుతుంది. దానికి ఆయన ‘ప్రాబ్లమ్ కేసు గురించి కాదు..ప్లేస్ గురించి.. ఆయన ప్రాణం పోయినా ఏ బ్లాక్ వైపు వెళ్లడు’ అని సమాధానమిస్తాడు. మరో లాయర్ మాట్లాడుతాడు. ‘నా 20 ఏళ్ల సర్వీసులో ఆ నోటరీని ఈ కోర్టులో ఎప్పుడూ చూడలేదు’ అంటాడు. ఈ క్రమంలోనే లాయర్ వేషధారణలోని శ్రీకాంత్ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను చూపిస్తారు. తర్వాత సీన్‌లో కనిపించకుండా పోయిన కూతురు సమీర కోసం కోర్ట్ ప్రాంగణంలో నారాయణ అనే వ్యక్తి ఆత్మాహుతి చేసుకుంటాడు. దాంతో కోర్టులోని వారందరూ షాకవుతారు.
నిజానికి నారాయణది సూసైడే కాదు మర్డర్ అంటుంటారు. ఎన్నో ఏళ్లుగా కేసులు లేని పరశురాంగారు ఇప్పుడు ఏదో రకంగా పాపులర్ కావాలని డబ్బు సంపాదించాలని చేస్తోన్న డెస్పరేట్ అటెంప్ట్ ఇది అంటూ లాయర్ ముఖేష్ రుషి హీరో శ్రీకాంత్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తాడు. మరో సందర్భంలో హీరో శ్రీకాంత్ కొడుకు తనని ఉద్దేశించి నాకు ఆయనలాగా ఫెయిల్యూర్ లాయర్ కావాలని లేదు అని ఘాటుగా సమాధానమిస్తాడు.
ఇవి కూడా చదవండి
ఇంతకీ శ్రీకాంత్ ఎందుకు ఏ బ్లాక్‌కి వెళ్లడు? ఏన్నో ఏళ్లుగా కేసులు వాదించని ఓ లాయర్ చివరకు నారాయణ ఆత్మాహుతి కేసుని ఎందుకు టేకప్ చేశాడు? అసలు సమీర ఎవరు? ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? పరశురాం కేసుని గెలిచాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ఒరిజినల్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ట్రైలర్‌తో సిరీస్‌పై అంచనాలు పెరిగాయి. వైవిధ్యమైన సినిమాలు, సిరీస్, షోస్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న జీ5 తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ అనే కోర్ట్ డ్రామాతో జూలై31న మెప్పించటానికి సిద్ధమవుతోంది.
సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ ఒరిజినల్‌ను రూపొందించారు. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ఒరిజినల్‌కు అరుణ్ చిలువేరు సంగీతం అందించగా..సూర్య సినిమాటోగ్రఫీ అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.