మీకు తెలుసా.. సమోసాను ఇంగ్లీషులో ఏమంటారు..? ఆన్సర్ అస్సలు ఊహించలేరు.. | What Is Samosa Called in English, History, Meaning and Fascinating Facts
సాయంత్రం నాలుగు దాటిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని గల్లీ గల్లీలో ఉన్న ఇరానీ కేఫ్‌లు, హోటళ్లు, రోడ్డు పక్కన బండ్ల దగ్గర సమోసాల ఘుమఘుమలు మొదలైపోతాయి. కడక్ ఇరానీ చాయ్ లేదా వేడివేడి ఫిల్టర్ కాఫీతో పాటు కరకరలాడే ఉల్లిగడ్డ సమోసా లేదా ఆలూ సమోసా నంజుకుని తింటే ఆ మజాయే వేరు. కాలేజీ కుర్రాళ్ల అడ్డా అయినా, ఆఫీస్ ముచ్చట్లయినా సమోసా లేనిదే ఈవెనింగ్ స్నాక్ పూర్తవదు. మరి మన రోజువారీ జీవితంలో ఇంతగా కలిసిపోయిన…