Watch: ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు.. ఏకంగా కిలోన్నర బంగారంతో పరార్!
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో భారీ బంగారం చోరీ కలకలం రేపింది. నగరంలోని షాహగంజ్ ప్రాంతంలో ఉన్న ‘విశ్వాస్ జ్యువెల్లర్స్’లో కస్టమర్లుగా నటించిన ఓ ముఠా సుమారు 1.5 కిలోల బంగారాన్ని చోరీ చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పురుషులు, బుర్ఖాలు ధరించిన నలుగురు మహిళలు వేర్వేరు సమయాల్లో కస్టమర్ల మాదిరిగా జ్యువెల్లరీ షోరూమ్‌లోకి ప్రవేశించారు. ముందుగా షోరూమ్‌లో పరిస్థితులను గమనించి రెక్కీ నిర్వహించిన ముఠా.. ఆ…