Andhra Pradesh: అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | 10 Foot Python Captured in Nandyal’s Kranti Nagar, Released into Nallamala Forest
నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్ కాలనీలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కాలనీవాసి రఫీ ఇంటి సమీపంలో సుమారు పది అడుగుల పొడవు, ఇరవై కేజీలకు పైగా బరువు ఉన్న కొండచిలువ ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ కొండచిలువ మళ్లీ కనిపించడంతో వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ రజాక్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రజాక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ పరిమాణంలో ఉన్న…