AP సైంటిస్ట్‌కు రూ.3.6 కోట్ల డెన్మార్క్ ఫెలోషిప్.. Fava Beans సాగుతో కాసుల పంట | Anantapur Horticulture Scientist Bathineni Vimala Wins Rs 3.6 Crore Denmark Fellowship
అనంతపురం, జులై 22: అనంతపురం జిల్లాకు చెందిన ఉద్యాన శాస్త్రవేత్త బాతినేని విమలకు అరుదైన అవకాశం దక్కింది. రేకులకుంట ఉద్యాన పంటల పరిశోధన స్థానం (Horticultural Research Station)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆమె.. డెన్మార్క్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఈ ఫెలోషిప్‌లో భాగంగా డెన్మార్క్‌లోని సదరన్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్లో మూడేళ్ల పాటు పరిశోధనలు చేయనున్నారు. ఇందుకోసం ఆమెకు సుమారు రూ.3.6 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. డెన్మార్క్‌లో సోయాబీన్ దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఫావా…