Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..
రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో టీ-ఫైబర్ పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ నెట్‌వర్క్ ద్వారానే ఇంటర్నెట్ సేవలను వినియోగించేలా చర్యలు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా ప్రతి కార్యాలయానికి కనెక్టివిటీ కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రైవేట్ ఇంటర్నెట్ బిల్లులకు చెక్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం…