ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్.. తగ్గనున్న ఛార్జీల భారం.. | TGSRTC Hyderabad Metro Joint Pass: Daily and Monthly Passes to Be Introduced Soon
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లల్లో ప్రయాణాలు చేసేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-హైదరాబాద్ మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్ లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని.. దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంజయ్ జాజు ఆదివారం మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు…