Vizag Zoo: పిల్లలకు ఇక పండగే.. విశాఖ జూలోకి అరుదైన కొత్త అతిథులు! | Indira Gandhi Zoological Park Visakhapatnam Gets 12 New Animals from Jamnagar Trust
విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది. ఇప్పటికే అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు, అరుదైన జంతువులకు నిలయంగా ఉన్న విశాఖ జూకు తాజాగా మరికొన్ని అరుదైన అతిథులు వచ్చి చేరాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో చేపట్టిన జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా మొత్తం 12 వన్యప్రాణులను విశాఖ జూకు తీసుకొచ్చారు. ఇందులో మూడు జీబ్రాలు, నాలుగు కాటన్-టాప్ టామరిన్లు, మూడు రెడ్-నెక్డ్ వాలబీలు, రెండు కామన్ మార్మోసెట్లు…