Headlines

Sri Satya : తల్లి కోసం నెలకు రూ.2.5 ఖర్చు.. సొంత ఇల్లు లేదు.. బిగ్ బాస్ శ్రీ సత్య జీవితంలో ఇన్ని కన్నీళ్లు ఉన్నాయా.. ? | Telugu Actress Sri Satya on Mothers Health, Property Loss, Parental Responsibility

Sri Satya : తల్లి కోసం నెలకు రూ.2.5 ఖర్చు.. సొంత ఇల్లు లేదు.. బిగ్ బాస్ శ్రీ సత్య జీవితంలో ఇన్ని కన్నీళ్లు ఉన్నాయా.. ? | Telugu Actress Sri Satya on Mothers Health, Property Loss, Parental Responsibility


బుల్లితెర నటి శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, ఆర్థిక పోరాటాలు, తల్లిదండ్రుల పట్ల తన బాధ్యత గురించి తాజాగా వెల్లడించారు. నెలకి రూ.2 లక్షల ఖర్చు, సొంత ఇల్లు లేకపోవడం వంటి విషయాలపై ఆమె స్పష్టంగా మాట్లాడారు. తన తల్లి వైద్య ఖర్చులు, ఆమె సంరక్షణ నిమిత్తం నెలకు సుమారు రూ. 2 నుంచి 2.5 లక్షల వరకు వ్యయం అవుతోందని శ్రీ సత్య తెలిపారు. ఇందులో మందులు, తల్లికి సహాయం చేసే పని అమ్మాయి జీతం వంటివి ఉన్నాయని వివరించారు. తన తల్లికి వారానికి రూ. 20,000 ఫిజియోథెరపీ ఖర్చులు అవుతాయని, ఈ బాధ్యతలన్నీ తన తండ్రితో కలిసి తాను చూసుకుంటున్నానని పేర్కొన్నారు. తమకు సొంత ఆస్తి, ఇల్లు లేదని, కుటుంబ వ్యాపారం నష్టపోవడంతో కోవిడ్ సమయంలో ఉన్న ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. భవిష్యత్తులో తాను పని చేయకపోతే తన తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటని తరచుగా భయపడుతున్నానని, ఇదే తన ఏకైక భయమని శ్రీ సత్య పంచుకున్నారు.

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలివేయడంపై శ్రీ సత్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను విస్మరించడం ఎవరికీ రైట్ లేదని ఆమె గట్టిగా చెప్పారు. కాకినాడలో తన కొడుకు కోసం రోడ్డు మీద ఎదురుచూస్తున్న ఒక వృద్ధురాలి ఉదాహరణను ప్రస్తావించారు, అటువంటి సంఘటనలు తనను ఎంతగానో బాధపెట్టాయని చెప్పారు. ఈ రోజుల్లో సంబంధాలకు విలువ లేకుండా పోయిందని, ఆధునిక సమాజం రోబోటిక్ జీవితాన్ని గడుపుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్య ఎదుర్కొంటున్న మరో సమస్య బాడీ షేమింగ్. తన ఆరోగ్య సమస్యలైన పీసీఓడీ (PCOD), పీసీఓఎస్ (PCOS), హార్మోనల్ మార్పుల కారణంగా బరువు పెరిగానని ఆమె వెల్లడించారు. ప్రతి 12 రోజులకు పీరియడ్స్ రావడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని, అయినా తనను బరువు పెరిగిందని ప్రజలు విమర్శిస్తున్నారని తెలిపారు.

అమ్మాయిలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోకుండా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. డిప్రెషన్‌లో ఉన్నా లేదా వయస్సు పెరిగినా శరీరంలో మార్పులు వస్తాయని, పదేళ్ల క్రితం ఉన్నట్లుగా ఇప్పుడూ ఉండాలని ఆశించడం అవాస్తవమని ఆమె అన్నారు. జిమ్ చేసి బరువు తగ్గినా ముఖం మారుతుందని, తన సహజమైన లుక్‌ను కోల్పోవడం ఇష్టం లేదని కూడా ఆమె వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *