పప్పుగుత్తితో లేదా గరిటెతో మెదిపి, తాజా ఆవ-మెంతుల పొడి వేసి నూనెలో మగ్గించే ఈ విలేజ్ స్టైల్ టమోటా పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో నుండి ముప్పావు కిలో మంచి ఎర్రటి గట్టి టమోటాలు, నిమ్మకాయ సైజు అంత – పీచు, గింజలు తీసిన చింతపండు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కారం , అర టీస్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, దోరగా వేయించి పొడి చేయడానికి మెంతులు, తాలింపుకు సరిపడా నూనె, ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు మరియు కరివేపాకు.