Headlines

100 Runs in 22 Balls : కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింత మ్యాచ్ | Don Bradman The Incredible 3 Over Century Record That Still Stuns Cricket Fans

100 Runs in 22 Balls : కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింత మ్యాచ్ | Don Bradman The Incredible 3 Over Century Record That Still Stuns Cricket Fans


100 Runs in 22 Balls : కాలం మారేకొద్దీ క్రికెట్ ఆట రోజురోజుకూ మరింత వేగవంతంగా మారిపోతుంది. టీ20 లీగ్‌ల రాకతో బ్యాటర్లు మొదటి బంతి నుంచే ఫోర్లు, సిక్సర్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుత తరం టాప్ ఆర్డర్ ఆటగాళ్లైన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ వంటి వారితో పాటు 15 ఏళ్ల భారత కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కూడా ఐపీఎల్‌లో 35 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించారు. అయితే క్రికెట్ ప్రపంచంలో కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ పూర్తి చేసిన విధ్వంసకర ప్లేయరు ఒకరు ఉన్నారని చాలా మందికి తెలియదు. అతడు మరెవరో కాదు, ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ సర్ డోన్ బ్రాడ్‌మాన్.

95 ఏళ్ల నాటి చారిత్రాత్మక మ్యాచ్

ఈ విచిత్రమైన సంఘటన జరిగి దాదాపు 95 సంవత్సరాలు కావోస్తోంది. 1931 నవంబర్ 2న ఆస్ట్రేలియాలో జరిగిన ఒక డొమెస్టిక్ మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ మ్యాచ్‌లో బ్రాడ్‌మాన్ బ్లాక్‌హీత్ జట్టు తరఫున లిత్గో జట్టుపై బరిలోకి దిగారు. ఆ రోజటి మ్యాచ్‌లో ఆయన ఏకంగా 256 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఆ ఇన్నింగ్స్ సమయంలో ఆయన కేవలం 3 ఓవర్ల వ్యవధిలోనే తన సెంచరీ మైలురాయిని పూర్తి చేసుకోవడం విశేషం.

ఒక్క ఓవర్లో 8 బంతులు.. 22 బంతుల్లోనే వంద పరుగులు

ఆ రోజుల్లో క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్నట్లుగా ఓవర్ కి 6 బంతులు కాకుండా 8 బంతులు ఉండేవి. ఆ రకంగా బ్రాడ్‌మాన్ కేవలం 22 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నారు. ఈ 3 ఓవర్ల వ్యవధిలో ఆయన మొదటి ఓవర్లో 33 పరుగులు, రెండో ఓవర్లో 40 పరుగులు, మూడో ఓవర్లో 27 పరుగులు పిండుకున్నారు. మొత్తం 256 పరుగుల తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌మాన్ ఏకంగా 14 సిక్సర్లు, 29 ఫోర్లు బాదడం విశేషం.

సర్ డోన్ బ్రాడ్‌మాన్ అంతర్జాతీయ క్రికెట్ రికార్డులు

ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో సర్ డోన్ బ్రాడ్‌మాన్ సాధించిన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆయన తన కెరీర్‌లో మొత్తం 52 టెస్టు మ్యాచ్‌లు ఆడి 80 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 99.94 సగటుతో 6996 పరుగులు చేశారు. ఇందులో 29 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 334 పరుగులు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ విషయానికి వస్తే.. 234 మ్యాచ్‌ల్లో 338 ఇన్నింగ్స్ ఆడిన బ్రాడ్‌మాన్ 95.14 సగటుతో 28,067 పరుగులు సాధించారు. అందులో 117 సెంచరీలు, 69 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆయన హయ్యెస్ట్ స్కోరు నాటౌట్‌గా 452 పరుగులు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *