Headlines

Voter List Check Online: మీ పేరు ఓటర్ లిస్టులో ఉందా..? లేదా? తెలుసుకోవడం ఇక చాలా ఈజీ.. కేవలం సెకన్లలోనే ఇలా.. | How to Check Your Name in Andhra pradesh Voter List 2025 for Local Elections Online


ఏపీలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికల జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు మొదలుపెట్టింది. ఓటర్ జాబితాను ఇప్పటికే సిద్దం చేయగా.. ఈ లిస్టును ఓటర్ల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. 2025 ఓటర్ల జాబితాను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఓటర్లు ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఏపీ సీఈసీ వెబ్‌సైట్లో తమ వివరాలను చూసుకోవచ్చు. తుది ఓటర్ల లిస్టులో తమ పేరు ఉందా..? లేదా? అనే వివరాలు చెక్ చేసుకోవచ్చు. కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ పేరు తనిఖీ చేసుకోవచ్చు. ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. సులభంగా ఎలా చెక్ చేసుకోవాలనేద ఇప్పుడు చూద్దాం.

మీ పేరు ఉందో.. లేదో చూసుకోవడం ఎలా..

-ముందుగా ఏపీ ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://sec-ems.ap.gov.in/apsec/లోకి వెళ్లాలి

-హోమ్ పేజీలో ఓటర్స్ పోర్టల్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి

-అనంతరం Search Your Name in Electoral Roll అనే ఎంపికను సెలక్ట్ చేసుకోవాలి

-ఆ తర్వాత Search by EPIC, Search BY Details అనే రెండు ఎంపికలు కనిపిస్తాయి

-అందులో సెర్చ్ బై ఎపిక్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-అనంతరం రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ అనే ఆప్షన్లు ఉంటాయి

-మీ ప్రాంతాన్ని బట్టి రూరల్ లేదా అర్బన్ అనేది ఎంచుకోండి

-ఆ తర్వాత జిల్లా, మండల పేరు ఎంచుకోండి. ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయాలి

-సెర్చ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-ఓటర్ జాబితాలో మీ పేరు, ఫొటో, బూత్ నెంబర్ ,సీరియల్ నెంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి

-ఈ వివరాలు కనిపిస్తే మీ పేరు ఓటర్ జాబితాలో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే..?

ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్ధిక సంఘం నిధులు అందుతాయి. దీంతో ఈ నిధుల కోసం నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా ముగియడంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఈసీ కూడా పనులను వేగవంతం చేస్తోంది. ఇటీవలే ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *