Headlines

Cinema : దెయ్యమే లేదు.. కానీ వణుకుపుట్టిస్తోన్న మూవీ.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 2500 కోట్ల సినిమా.. | This Horror Thriller Movie Get Out Now Trending in Hot Star OTT


సాధారణంగా హారర్ సినిమాలు అనగానే దెయ్యాలు, ఆత్మలు, రక్తం, భయంకరమైన బంగ్లాలు గుర్తుకొస్తాయి. కానీ ఇవేవీ లేకుండా కేవలం మానసిక భయంతోనే ప్రేక్షకులకు వణుకు పుట్టించవచ్చని నిరూపించిన గ్లోబల్ క్లాసిక్ మూవీ ‘గెట్ అవుట్’ (Get Out). ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ప్లామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 7.9 IMDb రేటింగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జార్డన్ పీల్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద సంచలనం. కేవలం 4.5 మిలియన్ డాలర్ల (దాదాపు ₹45 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఏకంగా రూ. 2500 కోట్లకు పైగా ($259.9 Million) వసూలు చేసింది. అంతేకాకుండా, సాధారణంగా హారర్ చిత్రాలకు లభించని ప్రతిష్టాత్మక అకాడమీ (ఆస్కార్) అవార్డును ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’ విభాగంలో దక్కించుకుంది.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

అసలు కథేంటి?

క్రిస్ (డానియల్ కలుయా) అనే బ్లాక్ ఫోటోగ్రాఫర్, తన వైట్ గర్ల్‌ఫ్రెండ్ రోజ్ (అలిసన్ విలియమ్స్) తల్లిదండ్రులను కలవడానికి ఆమె హోమ్‌టౌన్‌కు వెళ్తాడు. అక్కడ రోజ్ కుటుంబ సభ్యులు క్రిస్‌ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. అయితే, రానురాను ఆ ఇంట్లో పనిచేసే సిబ్బంది ప్రవర్తన, అక్కడి వాతావరణం క్రిస్‌కు చాలా వింతగా, అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఆ వింత ప్రవర్తన వెనుక ఉన్న దాగిన భయానక నిజాన్ని క్రిస్ ఎలా కనిపెట్టాడనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఈ సినిమాలో భయపెట్టే దెయ్యాలు ఉండవు. కానీ ‘హిప్నోసిస్’ (Hypnosis) ద్వారా ఒక మనిషి మెదడును తన కంట్రోల్‌లోకి తెచ్చుకుని, అతడిని ఆలోచించలేని నిస్సహాయ స్థితికి నెట్టేసే కాన్సెప్ట్ ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచే అనుభూతిని ఇస్తుంది. లీడ్ రోల్ చేసిన డానియల్ కలుయా నటన ఈ సినిమాకు ప్రధాన బలం. సమాజంలో పైకి ఎంతో మంచిగా కనిపించే మనుషుల డార్క్ సైడ్‌ను దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఈ వీకెండ్‌లో మైండ్ రేసింగ్ థ్రిల్లర్.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *