పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! | Mother Risks Her Life to Shield Children From a Passing Train, Video Goes Viral tv9d – Viral Videos in Telugu
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కళ్లు బైర్లు కమ్మే భయానక దృశ్యం ఒకటి కెమెరాకు చిక్కింది. వేగంగా దూసుకొస్తున్న రైలు నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన శరీరాన్నే అడ్డుపెట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్లాట్‌ఫామ్‌కు, రైలు పట్టాలకు మధ్య ఉన్న అత్యంత ఇరుకైన సందులో ఇద్దరు పిల్లలు గోడకు అతుక్కుని ఉండగా, ఆ తల్లి వారిపై వంగి కవచంలా నిలబడింది. రైలు అతి…