తెరపై గయ్యాళి.. తెర వెనుక అన్నపూర్ణ.. సెట్‌లో అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ..
తెలుగు సినిమా చరిత్రలో నటి సూర్యకాంతం గారి స్థానం అద్వితీయం. భగవంతుడు లక్ష మంది ఆడవాళ్లలో ఆమెకు మాత్రమే ప్రసాదించిన ఒక ప్రత్యేకతను ఆమె నటనలో స్పష్టంగా చూడవచ్చు. ఆమె గయ్యాలి పాత్రలకు, అత్త పాత్రలకు ప్రాణం పోసిన తీరు మరెవరికీ సాధ్యం కాలేదు. రేలంగి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు వంటి దిగ్గజ నటులతో ఆమె జోడి కడితే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టేవారు ఆనాటి పంపిణీదారులు. ఆమె తెరపై కనిపిస్తే సినిమాకు ఒక ప్రత్యేకమైన విలువ…