పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్..! | Pakistan: Balochistan declares August 11 Independence Day, seeks global recognition
పాకిస్థాన్‌లో వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతున్న బలూచిస్తాన్ ప్రాంతంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లు ఇటీవల పేర్కొంది. స్వయం ప్రకటిత బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం తాజాగా ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలు, సంఘాలు, మద్దతుదారులు ఈ రోజును జాతీయ ఐక్యతతో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అలాగే తమను స్వతంత్ర, సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. బలూచ్…