Gummadikaya Majjiga Charu: శరీరానికి చెప్పలేనంత చలువ చేసే బూడిద గుమ్మడికాయ మోరు కూటు.. కడుపుకి ఎంతో హాయి!
పొట్టకు ఎంతో తేలికగా అరిగే ఈ బూడిద గుమ్మడికాయ కూటు తింటే రోజంతా శరీరం ఎంతో చల్లగా, హాయిగా ఉంటుంది. ఈ మోరు కూటు తయారీ విధానం ఎంతో సులభం. ముందుగా బూడిద గుమ్మడికాయ పైపొట్టు, లోపలి గింజలు తొలగించి చిన్న చిన్న దోసకాయ ముక్కల సైజులో కోసుకోవాలి. ఒక పాత్రలో ఉడికించడానికి నీళ్లకు బదులుగా చాలా పల్చటి మజ్జిగ తేట పోయాలి. సుమారు లీటరు మజ్జిగ తేటలో ఉప్పు వేసి గుమ్మడికాయ ముక్కలను మూతపెట్టి మెత్తగా…