TET అర్హత లేకుంటే ప్రమోషన్ లేనట్లే.. ఉద్యోగానికీ గండమే..! ప్రభుత్వ టీచర్లకు మరో గోల్డెన్ ఛాన్స్ | No TET, No Promotion: Telangana Government Teachers Get Another Chance
హైదరాబాద్, జులై 22: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ 2026 నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆగస్ట్ 31, 2028వ తేదీలోపు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు టెట్ అర్హత సాధించవల్సి ఉంటుంది. లేదంటే ఉద్యోగం విరమించవల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతులు పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందే….