Headlines

EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే! | EPF Members Can Get Free Insurance Cover of Up to rs 7 Lakh: Here’s How video – Business Videos in Telugu

EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే! | EPF Members Can Get Free Insurance Cover of Up to rs 7 Lakh: Here’s How video – Business Videos in Telugu


ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ సాధారణంగా పీఎఫ్ ఖాతా ఉంటుంది. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి, అలాగే యాజమాన్యం నుంచి కొంత మొత్తం ఈ ఖాతాలో జమ అవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 8.25 శాతం వడ్డీని కూడా చెల్లిస్తోంది. అయితే, పీఎఫ్ ఖాతాదారులకు కేవలం పొదుపు, వడ్డీ మాత్రమే కాకుండా ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం అందుతుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ ఉచిత బీమా ప్రయోజనాన్ని ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. ఉద్యోగంలో కొనసాగుతూ నెలనెలా పీఎఫ్ చందా చెల్లిస్తున్న ప్రతి ఉద్యోగి ఈ పథకానికి అర్హుడే. సర్వీసులో ఉన్న సమయంలో ఉద్యోగి ప్రమాదవశాత్తూ లేదా అనారోగ్యంతో మరణిస్తే వారి నామినీకి ఈ బీమా మొత్తం లభిస్తుంది. ఉద్యోగి పొందే బేసిక్ జీతం, డీఏ అలాగే పీఎఫ్ ఖాతాలోని నిల్వల ఆధారంగా బీమా పరిహారాన్ని లెక్కిస్తారు. ఈ పథకం కింద నామినీకి కనీసం రూ.2.50 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఒకవేళ ఉద్యోగంలో చేరి ఏడాది పూర్తి కాకపోయినా నామినీకి కనీసం రూ.50,000 బేస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఈ బీమా కోసం ఉద్యోగి జీతం నుంచి పైసా కూడా కోత విధించరు. కంపెనీ యాజమాన్యమే ఉద్యోగి బేసిక్ జీతం + డీఏ నుంచి 0.5% ప్రీమియంగా చెల్లిస్తుంది. 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ ‘ఫామ్ 5 IF’ పూర్తి చేసి, సదరు కంపెనీ యాజమాన్యం సంతకంతో రీజినల్ పీఎఫ్ ఆఫీస్‌లో సమర్పించాలి. పత్రాలు సరిగ్గా ఉంటే 20 నుంచి 30 రోజుల్లో డబ్బులు నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఈ ప్రయోజనం సులభంగా అందాలంటే పీఎఫ్ ఖాతాకు నామినీని చేర్చడం తప్పనిసరి. ఇంకా నామినీని యాడ్ చేయని ఉద్యోగులు వెంటనే ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పీఎఫ్ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!

ట్రెండ్‌ మారింది గురూ.. వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *